34 సంవత్సరాల తర్వాత విద్యా విధానంలో భారత ప్రభుత్వం చేసిన 10 మార్పులు ఇవే..తప్పక తెలుసుకోండి.!

34 సంవత్సరాల తర్వాత విద్యా విధానంలో భారత ప్రభుత్వం చేసిన 10 మార్పులు ఇవే..తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

బుధవారం నాడు కేంద్ర క్యాబినెట్ ఉన్నత విద్యా విధానంలో కొన్ని సవరణలు చేసింది. 34 సంవత్సరాల నుండి ఒకే పద్దతి లో నడిచిన విద్యా విధానం ఇప్పుడు మారబోతోంది.  కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కేంద్ర విద్యా శాఖ గా మార్చారు. ఈ మార్పులన్నీ మాజీ ఇస్రో చీఫ్ కె.కస్తూరి రంగన్ నేతృత్వంలో జరిగాయి. ఉన్నత విద్యా సంస్థలన్నీ ఒకే నియంత్రణ సంస్థ కింద నడుస్తాయి అని, ఎం. ఫిల్ కోర్సు కూడా రద్దు చేశారు అని కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ప్రకటించారు.

Video Advertisement

డిజిటల్ విద్యావిధానాన్ని ఇంకా విస్తరించడానికి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఈటీఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నారని, తొలి దశ లో ఎనిమిది భాషల్లో  ఈ – కోర్స్ ప్రారంభిస్తామని, అలాగే వర్చువల్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్ ఖరే చెప్పారు. నూతన విద్యా విధానంలో అమలు చేయనున్న ముఖ్యమైన అంశాలు విషయాలు ఇవే.

#1 ఐదో తరగతి వరకు పాఠాలు మాతృభాషలోనే చెబుతారు. ఆన్సర్లు బట్టి పట్టేసి రాసే విధానాన్ని ఆపేసి కొత్త విధానంలో బోర్డు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రోగ్రెస్ కార్డు లో కేవలం సబ్జెక్ట్ లో వచ్చిన మార్కులే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో వచ్చిన మార్కులను కూడా వేస్తారు.

#2 పదవ తరగతి తర్వాత ఇంటర్ అంటే 10 + 2 నుండి 5+3+3+4 గా మారుస్తారు. మొదటి ఐదు సంవత్సరాల్లో ప్రీ ప్రైమరీ నుండి రెండవ తరగతి, రెండవ దశలో 3 నుండి 5 వ తరగతి, మూడవ దశలో 6 నుండి 8 వ తరగతి, నాలుగవ దశలో 9 వ తరగతి నుండి 12వ తరగతి గా విభజిస్తారు.

representative image

#3 2035 కల్లా 50 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అందుకునేటట్టు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా 2040 కల్లా ఉన్నత విద్యా సంస్థలన్నీ విభిన్న కోర్సులు అందించే సంస్థలు గా మారుతాయి. ప్రతి విద్యా సంస్థలో మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

#4 అన్ని పాఠశాలల్లోనూ సంస్కృతభాషను ప్రైమరీ లాంగ్వేజ్ గా ఉండాలని ఆదేశించారు. సంస్కృత విద్యాలయాలను కూడా విభిన్న కోర్సులు అందించే విద్యాసంస్థలుగా మారుస్తారు.

#5 విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అంతే కాకుండా అన్ని కోర్సులను రెండు భాషల్లోనూ అందిస్తారు.

#5 ఉన్నత విద్య అభ్యసించేందుకు మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. అంటే ఒకవేళ ఒక విద్యార్థి కోర్సు మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తే అంతకు ముందు వచ్చిన మార్కులను వాడుకోవచ్చట.

#6 ప్రపంచంలో ఉన్న టాప్ 100 విదేశీ విశ్వవిద్యాలయాల కేంద్రాలు భారతదేశంలోనే నిర్వహించడానికి అనుమతిస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తారు.

representative image

#7 ఉన్నత విద్యా సంస్థలను, ప్రొఫెషనల్ విద్యాసంస్థలను వివిధ రకాల కోర్సులు అందించే సంస్థలు గా మారుస్తారు. దేశంలో ఉన్న 45000 అఫిలియేటెడ్ కాలేజీలకు ఉన్న అక్రెడిటేషన్ ప్రకారం గ్రేడెడ్ అటానమీలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్సియల్ అటానమీ లను అందిస్తారు.

#8 అన్ని విద్యా సంస్థల్లోనూ లిటరేచర్, ఆర్ట్స్, స్పోర్ట్స్, సంగీతం, ప్యూర్ అప్లైడ్ సైన్సెస్, డాన్స్, సోషియాలజీ, తత్వ శాస్త్రం, ట్రాన్స్లేషన్, థియేటర్ కూడా ఉండేలాగా చూస్తారు.

#9 అన్ని కాలేజీలకు కలిపి ఒకటే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కి మించి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి వీలులేకుండా నిషేధించారు.

#10 ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీడీపీలో 4.43 శాతం విద్యారంగానికి కేటాయిస్తున్నారు. ఇప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తిలో 6 శాతం విద్యా రంగానికి కేటాయిస్తారు.

నూతన విద్యా విధానం గురించి సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సీఈఎస్) చైర్మన్ నాగటి నారాయణ మాట్లాడుతూ ఇలా విద్యావిధానాన్ని నాలుగు విభాగాలుగా చేయడం వల్ల ఎన్నో గందరళాలు ఎదురవుతాయని, అలాగే సంస్కృతాన్ని అభివృద్ధి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ ని పక్కన పెట్టడం కూడా సరైన నిర్ణయం కాదు అని,

జిల్లాకి ఒక్క అటానమస్ విద్యాసంస్థ లేదా డిసిప్లీనరీ యూనివర్సిటీ ఉండాలి అనే నిర్ణయం వల్ల ఎన్నో విద్యాసంస్థలు మూత పడే అవకాశం ఉందని, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కి, అలాగే ఆర్ట్స్ కి సమానత ఇవ్వడం 21వ శతాబ్దపు ఆలోచన అవ్వదు అని అన్నారు.


End of Article

You may also like