ప్రధాని నరేంద్ర మోదీ  జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు . జనతా కర్ఫ్యూను సక్సెస్ ఫుల్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కూడళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి.. జనం రోడ్లపైకి రాకుండా చేస్తున్నారు,కొందరు వ్యక్తులు జనతా కర్ఫ్యూ లెక్కచేయకుండా హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతం లో రోడ్ల పై తిరుగుతున్నారు,వీరిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు,జనతా కర్ఫ్యూ ఉంది అని తెలిసి కూడా కారణం లేకుండా బయటకి వచ్చినందుకు వారికి ప్లకార్డు ఇచ్చి కూడళ్లలో ప్రదర్శింపజేశారు.ఇందులో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్ధం .

Video Advertisement

 

జనతా కర్ఫ్యూ ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు రోడ్ల మీదకి వచ్చారు ,వారిని హైదరాబాద్ పోలీసులు అడ్డుకొని మీకు దండం పెడతాం ఇంటికెళ్లిపోండి అంటూ హైదరాబాద్ పోలీసుల వేడుకున్నారు ,ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .