Ads
- చిత్రం : ఉగ్రం
- నటీనటులు : అల్లరి నరేష్, మిర్నా.
- నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
- దర్శకత్వం : విజయ్ కనకమేడల
- సంగీతం : శ్రీ చరణ్ పాకాల
- విడుదల తేదీ : మే 5, 2023
Video Advertisement
స్టోరీ :
శివ (అల్లరి నరేష్) ఒక స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ ఆఫీసర్. కొంత మంది మాదకద్రవ్యాలు తీసుకుంటూ అమ్మాయిలని ఇబ్బంది పెట్టే వారిని అరెస్ట్ చేస్తాడు. తర్వాత వాళ్లు వచ్చి శివ భార్య అయిన అపర్ణ (మిర్నా) ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత శివ ఆ బృందంలో ఉన్న ముగ్గురిని చంపేస్తాడు. కానీ ఒక్కరు మాత్రం మిస్ అవుతారు.
తర్వాత శివ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత శివ భార్య, కూతురు కనిపించకుండా పోతారు. అసలు వాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఆ బృందంలో నాలుగవ వ్యక్తి వీళ్ళని ఏమైనా చేశాడా? అసలు అతను ఎక్కడికి వెళ్లి పోయాడు? శివ ఈ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరించాడు? తన భార్యని, కూతురిని కనిపెట్టాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కొద్ది సంవత్సరాల క్రితం అల్లరి నరేష్ అంటే కామెడీకి పెట్టింది పేరు. వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ తన కామెడీ టైమింగ్ తో స్టార్ హీరో అయ్యారు. ఆ తర్వాత అల్లరి నరేష్ తనలో ఉన్న నటుడిని ఆవిష్కరిస్తూ రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నారు. అందులో భాగంగానే గమ్యం లాంటి సినిమాలు కూడా చేశారు. అయితే కొంత కాలం క్రితం నాంది సినిమాతో అల్లరి నరేష్ ఇంత సీరియస్ పాత్రలు కూడా చేయగలరు అని నిరూపించారు.
ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ తో కలిసి ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ ఒక డిఫరెంట్ పాత్ర పోషించారు. ఇలాంటి పాత్రలో అల్లరి నరేష్ ని అంతకుముందు మనం చూడలేదు. సినిమా అంతా సీరియస్ గా సాగుతుంది. ట్రైలర్ లో చూసిన విధంగానే ఇది ఒక సస్పెన్స్ యాక్షన్ డ్రామా. డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ సినిమా మొత్తంలో ఏదో తగ్గిన ఫీలింగ్ వస్తుంది.
అంటే చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చాలా చోట్ల కొన్ని సీన్స్ పెట్టారు. అవి ప్రేక్షకులకి, “అసలు ఇలా జరుగుతుందా?” అని అనిపిస్తుంది. అలాగే అమ్మాయిలపై జరిగే సమస్యల మీద సినిమా తీసినా కూడా అది చూపించే విధానం చాలా డ్రామాటిక్ గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి కాన్సెప్ట్ అనిపిస్తూ ఉన్నా కూడా ప్రేక్షకులకి ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడ అనిపించదు.
శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాకి పెద్ద హైలైట్ అల్లరి నరేష్. అల్లరి నరేష్ ఈ పాత్రకి కరెక్ట్ గా సరిపోయారు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా చేశారు. కానీ ఎమోషన్స్ విషయంలో, అవి తెరపై చూపించే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపి.
ప్లస్ పాయింట్స్ :
- అల్లరి నరేష్ నటన
- నిర్మాణ విలువలు
- మ్యూజిక్
- ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక మంచి సస్పెన్స్ డ్రామా సినిమా చూద్దాం అనుకునే వారికి, అల్లరి నరేష్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి ఉగ్రం సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article