వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక కథ ఏంటి.?

వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక కథ ఏంటి.?

by Mounika Singaluri

ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో ఆయన భార్యగా అల్లు స్నేహారెడ్డి కూడా అంతే ఫేమస్. ఈమె తన భర్తతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తప్పక హాజరవుతుంది. ఏ హీరోయిన్లకి తీసిపోని అందంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడుతుంది. ఇప్పటివరకు ఇంటి వ్యవహారాలు, బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూసుకున్న స్నేహ రెడ్డి సడన్గా కెమెరా ముందు కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది.

Video Advertisement

https://www.instagram.com/reel/C185zi8vgW6/

అయితే సిల్వర్ స్క్రీన్ పై కాదు ఫస్ట్ టైం ఒక యాడ్ లో యాక్ట్ చేసింది స్నేహారెడ్డి. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ చాకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ యాడ్లో యాక్ట్ చేసింది. అనవసరమైన మేకప్ తో హడావిడి చేయకుండా పింక్ కలర్ డ్రెస్ లో నాచురల్ గా కనిపించింది. యాడ్ కి కావలసిన విధంగా ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ లా నటించింది.


ఇది ఇలా ఉంటె…స్నేహారెడ్డి ఇటీవల తన సోదరి నాగు రెడ్డి (నాగలక్ష్మి), స్నేహితురాలు స్మిత రెడ్డిలకు చెందిన టాప్ స్టిచ్ (ఫ్యాషన్ దుస్తుల కంపెనీ)తో కలిసి ఫైర్ ఫ్లై కార్నివల్ ఈవెంట్ ని శనివారం ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వచ్చారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “పుష్ప షూట్ మధ్యలో నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి, స్మిత రెడ్డి కి అభినందనలు. ఈ కార్యక్రమం ని ఇంత సపోర్ట్ చేసిన మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు”అని అన్నారు. ఈ ఈవెంట్ కి సంభందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


You may also like

Leave a Comment