అల్లు అర్జున్ అట్లీ అనిరుధ్ కాంబినేషన్ లో కొత్త మూవీ…!

అల్లు అర్జున్ అట్లీ అనిరుధ్ కాంబినేషన్ లో కొత్త మూవీ…!

by Mounika Singaluri

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల షూటింగ్ లో అల్లు అర్జున్ కి నడుం నొప్పి వచ్చిందని షూటింగ్ వాయిదా కూడా వేశారు.

Video Advertisement

అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు అనేదానిపైన స్పష్టత లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీని ప్రకటించారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు అల్లు అర్జున్ హోం బ్యానర్ గీత ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.ఇది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వినికిడి.

అయితే అల్లు అర్జున్ మరో కొత్త మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టిన తమిళ్ డైరెక్టర్ అట్లి డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక మూవీ చేయనున్నారు అనే వార్త ఎప్పటినుండో వినిపిస్తుంది. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ అట్లీతోనే అని అంటునారు. ఇప్పటికే ఈ కథ సినిమాకు సంబంధించిన కథ చర్చిలు అల్లు అర్జున్ అట్లీ పూర్తి చేశారట.

అట్లీ చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని వీలైనంత త్వరగా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే దాని పైన క్లారిటీ లేదు.ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నారట. అట్లి సినిమాలంటే ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఫార్మేట్ లో ఉంటాయి. అయితే అల్లు అర్జున్ ని అట్లీ ఎలా చూపించబోతాడో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 చివరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది


End of Article

You may also like