పుష్ప సినిమా కోసం అలా డైట్ తీసుకోవడం వల్లనే… బన్నీకి ఆ లుక్ వచ్చిందని మీకు తెలుసా..?

పుష్ప సినిమా కోసం అలా డైట్ తీసుకోవడం వల్లనే… బన్నీకి ఆ లుక్ వచ్చిందని మీకు తెలుసా..?

by Megha Varna

Ads

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనపడ్డారు. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ తో పుష్ప సినిమా వచ్చింది. తన టాలెంట్ తో పాపులర్ అయిపోతూ ఐకాన్ స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్.

Video Advertisement

డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లుఅర్జున్ యాక్టింగ్ కి ఎంతోమంది ఫిదా అయిపోయారు. చాలామంది సెలబ్రిటీలు అయితే అల్లు అర్జున్ ని ప్రశంసిస్తున్నారు. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాస్త డిఫరెంట్ గా కనిపించారు. ఇలా కనబడడానికి కారణం అయిన తీసుకున్న డైట్.

మూడు సంవత్సరాల పాటు ఈ డైట్ ని అల్లు అర్జున్ తీసుకున్నారట. చీజ్ మొదలైన పాల పదార్థాలకు దూరంగా ఉన్నారు అన్ని రోజులు కూడ. అలానే డైట్ లో కార్బోహైడ్రేట్స్ ను చాలా తక్కువగా తీసుకునే వారట. ప్రతి రోజూ 45 నిమిషాల పాటు వర్కౌట్స్ చేయడం.. ఆ తర్వాత రన్నింగ్ చేయడం తో పాటుగా కాఫీ లేదా జ్యూస్ తీసుకోవడం.. ఆ తర్వాత అల్పాహారం తీసుకోవడం బన్నీ డైట్ లో పార్ట్.

అల్పాహారం లో గుడ్ల సొన లేకుండా ఆమ్లెట్ తినేవారు. 11:30 నుంచి 12 గంటల సమయంలో ప్రీ మీల్స్ ని తీసుకునే వారు. అలానే సూప్, గ్రీన్ సలాడ్ కూడా తీసుకునేవారు. మాంసం, కార్బోహైడ్రేట్స్, కూరగాయలను లంచ్ లో తీసుకునేవారు. స్నాక్స్ అయితే ఉడకబెట్టిన గింజలు మాత్రమే.

అలానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిన్నర్ పూర్తి చేసేవారట. డిన్నర్ లో బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ లేదా చేపలు ఉండేవి. అప్పుడప్పుడూ చీట్ మీల్ ని తీసుకునేవారు. ఇలా డైట్ లో మార్పులు చేయడం వల్లనే ఆ లుక్ వచ్చింది బన్నీకి.


End of Article

You may also like