Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన సినిమాలు కూడా కొన్ని వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమా కూడా వేరే భాషల్లో రీమేక్ అయ్యింది.
ఈ సినిమాకి తెలుగులో కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జెనీలియా హీరోయిన్ గా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. దాదాపు 16 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగులో హిట్ అయ్యింది. హ్యాపీ సినిమాని ఒడియాలో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమా ఒడియాలో లోఫర్ పేరుతో విడుదల అయ్యింది. ఈ రీమేక్ లో అక్కడి స్టార్ హీరో అయిన బాబుషాన్ మొహంతి హీరోగా నటించారు. ఇంక ఈ సినిమాలో స్టోరీ కూడా పెద్దగా మార్చలేదు. దాదాపు చాలా వరకు తెలుగులో ఉన్నట్టే తీశారు. కానీ అల్లు అర్జున్ పోషించిన పాత్రని వేరే ఏ హీరో అయినా చేస్తే మనకి చూడడానికి కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది.
అంతే కాకుండా అల్లు అర్జున్ చాలా స్టైల్ గా చేసిన కొన్ని సీన్స్ ఈ రీమేక్ లో కామెడీగా, అసలు సీన్ లో ఉన్న ఫీల్ మారిపోయినట్టు అనిపిస్తున్నాయి. “మొన్నటి వరకు కేవలం బెంగాలీ రీమేక్స్ మాత్రమే మన తెలుగు సినిమాలని కామెడీ చేశాయి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీలలో కూడా మన సినిమాలను ఇలాగే చేశారు” అని అంటున్నారు నెటిజన్లు. దాంతో ఈ ఒడియా రీమేక్ సినిమాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
watch video :
https://www.youtube.com/watch?v=WMV3t4Gl3ig
End of Article