Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన” పుష్ప-ది రైజ్” మూవీ పాన్ ఇండియ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.
Video Advertisement
పుష్ప 2 సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని భాషలలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ విడుదలను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరువుకుంటున్న ఈ మూవీ సెట్స్ నుంచి తాజాగా డైలాగ్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప మూవీ సెన్షేషనల్ విజయన్ని దక్కించుకుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో పుష్ప యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. అల్లు అర్జున్ తాజాగా ఫ్యాన్స్ కోసం పుష్ప-2 మూవీ షూటింగ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుకుమార్, అల్లు అర్జున్ మూవీ స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ కనిపించారు. అయితే అభిమానులు దాన్ని స్క్రీన్ షాట్ తీసి, సామాజిక మధ్యమాలలో షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఆస్క్రీన్ షాట్ లో కేశవ పాత్ర కోసం రాసినట్లుగా ఒక డైలాగ్ ఉంది. ‘ముందు అయితే నీకు, షెకావత్ కి గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది’ అని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగ్ వైరల్ గా మారింది. పుష్ప 2 మూవీలో పుష్పరాజ్ కు, షెకావత్ కు మధ్య వచ్చే సన్నివేశాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో చాలా లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది.తాజాగా లీకైన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. కేశవ్ పాత్రకే ఇటువంటి డైలాగు ఉంటే, హీరోకి ఏ రేంజ్ డైలాగులు ఉంటాయో అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సంతోషంలో ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఈ డైలాగ్ తో మరింత సంతోషపడుతున్నారు.
#Pushpa2TheRule dialogue leak 🔥🔥🔥🔥🔥@alluarjun @instagram @AlluArjunRules @TWTA____
@Alluprashanth9 @imsarathchandra pic.twitter.com/0Ucc62O8ac— 𝘼𝙧𝙞𝙛 𝘼𝙟𝙟𝙪 🎀𝐀𝐀ᴅʜꜰ☟ (@AjjuArif) August 30, 2023
Also Read: అసలు ఏంటి ఈ సినిమా..? నాగార్జున రీమేక్ చేసే అంతగా ఏం ఉంది ఇందులో..?
End of Article