అభిమానుల కోసం “అల్లు అర్జున్” 10 కోట్లు వదులుకున్నారా..? ఏం జరిగిందంటే..?

అభిమానుల కోసం “అల్లు అర్జున్” 10 కోట్లు వదులుకున్నారా..? ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

ప్రతీ సినిమాకి ఒక స్టైల్ తీసుకొస్తాడు బన్నీ. తన స్టైల్ తోనే ట్రెండ్ సెట్ చేస్తాడు. ఇక పుష్ప తర్వాత బన్నీ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. కానీ ఎంత ఎత్తుకి ఎదిగినా తన అభిమానులను ఎప్పుడూ మర్చిపొడు బన్నీ. ఏమి చేసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు.

Video Advertisement

ఎందుకంటే బన్నీకి అభిమానులంటే అంత ప్రేమ. వాళ్ళ మంచి కోరేవాడే ఐకాన్ స్టార్. ఇక ఇంత క్రేజ్ ఉన్న హీరో, మరోసారి అభిమానులపై ప్రేమతో 10 కోట్లు వొదులుకున్నాడు అని తెలిసాక ఫ్యాన్స్ అందరు షాక్ అయ్యారు. అసలు ఏమైంది ఎందుకు అంత వొదులుకున్నారు బన్నీ అనుకుంటూ చూస్తే..

real life behavior of allu arjun

మమూలుగానే బన్నీకి చాలా క్రేజ్ ఉంటుంది. ఇక పుష్ప మూవీ రిలీజ్ అయ్యాక అది రెట్టింపు అయ్యింది. ఈ తరుణంలో పుష్ప 2 షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో… వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు చెయ్యి ఊపారు. ఈ నేపథ్యంలో అనేక ప్రకటనలు కూడా చేశారు. బైక్స్ పైన, బస్సుల పైన, డ్రింక్స్ పైన ఇలా ఎన్నో చేశారు. కాగా రెమ్యునరేషన్ మాత్రం భారీగానే తీసుకుంటున్నారు. కేవలం ఒక్కరోజు కొన్ని గంటలు ప్రకటనల షూటింగ్ కి వెళితే సుమారు 7 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. అయితే ఈ తరుణంలోనే ఒక పొగాకు ఉత్పత్తుల సంస్థ వారు బడా ఆఫర్ ఇచ్చినప్పటికీ… అభిమానుల కోసం బన్నీ దాన్ని తిరస్కరించారట.

edit on allu arjun zomato advertisement

ఎందుకు అని అడిగితే నేను ఇలాంటి పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు చేస్తే, నన్ను నమ్ముకున్న నా అభిమానులు కూడా దాన్ని అనుసరిస్తారని… ఆ పోగాకుకు అలవాటు పడితే వాళ్ళ జీవితాలు పాడవుతాయని. అది తనకి ఇష్టం లేదని అల్లు అర్జున్ చెప్పారట. అందులోనూ నా వల్ల అసలు అలాంటి తప్పు జరగకూడదని అందుకే వదులుకున్నానని చెప్పారట. ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించరని చెప్పారు. మీరు కేవలం స్క్రీన్ ముందుకు వచ్చినా చాలు కొన్ని గంటలకి 10 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా, దాన్ని బన్నీ తిరస్కరించారు. దీంతో అభిమానుల్లో అల్లు అర్జున్ పైన మరింత అభిమానం, గౌరవం పెరిగి, నెట్టింట కామెంట్లతో హర్షం వ్యక్తం చేశారు.


End of Article

You may also like