“అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?

“అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?

by kavitha

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గుంటూరు కారం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ మూవీ ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే, త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే చిత్రం గురించి ప్రకటించడంతో  అటు మహేష్ అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Video Advertisement

అయితే అల వైకుంఠపురంలో సినిమా తరువాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు టాక్ వినిపించింది. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వీరి కాంబోలో మూవీని ప్రకటించడంతో ఆ మూవీ కథ ఇలా ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
trivikram-bunnyఈసారి అంతకుమించి అనేలా కొత్త కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నాడు అందువల్ల త్రివిక్రమ్ అల్లు అర్జున్ రేంజ్ కు తగిన విధంగానే స్టోరీని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినిపిస్తున్నటాక్ ప్రకారం వీరి కాంబోలో రాబోయే మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే ఉంటుందట.
గతంలో త్రివిక్రమ్ ఎన్నోసార్లు ఈ కాన్సెప్ట్ తో కొన్ని స్టోరీలను అనుకున్నాడు. అయితే అవి సెట్స్ పైకి వెళ్లలేదు.  గుణశేఖర్ తెరకెక్కించాలనుకున్న ‘హిరణ్యకశిప’ సినిమాకు మాటలను అందించాలని త్రివిక్రమ్ భావించాడు. కానీ సినిమా ముందుకు వెళ్లలేదు. త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే మూవీ ఏమిటి అనే విషయం పై అందరికి ఇంట్రెస్ట్  కలిగింది. అయితే అది సోషియో ఫాంటసీ మూవీ అని బలంగా వినిపిస్తోంది.
అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఎటువంటి చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుంటారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఏర్పడింది. మాటల మాంత్రికుడుగా గా పేరుగాంచిన త్రివిక్రమ్ పెన్ పవర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా త్రివిక్రమ్ హిస్టరీ, మైథలాజికల్ కథల పై పట్టున్న రైటర్. అయితే త్రివిక్రమ్ ఎటువంటి ఫాంటసీ స్టోరీ పై దృష్టి పెడతాడో అని అనుకుంటున్నారు.

Also Read: “ఆదిపురుష్” కి ప్రభాస్ ఎంత తీసుకున్నారో తెలుసా..?


End of Article

You may also like