అల్లు అర్జున్ భార్య “స్నేహ రెడ్డి” గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా.?

అల్లు అర్జున్ భార్య “స్నేహ రెడ్డి” గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా.?

by Mohana Priya

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ పెయిర్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి. మార్చి, 2011 లో అల్లు అర్జున్ ఇంకా స్నేహ పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరిదీ ప్రేమ వివాహం.అల్లు అర్జున్, స్నేహ యునైటెడ్ స్టేట్స్ లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ పెళ్లిలో కలిశారట. స్నేహా కి అల్లు అర్జున్ యాక్టర్ అని తెలుసు కానీ, అప్పటికి అల్లు అర్జున్ నటించిన సినిమాలో చూడలేదట. ఈ విషయం స్నేహ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.

Video Advertisement

స్కూలింగ్ అంతా హైదరాబాద్ లో చేసిన స్నేహ తర్వాత యుఎస్ఎ లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్నేహ తండ్రి కేసీ శేఖర్ రెడ్డి, సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకులు.

అబ్రాడ్ లో చదివిన స్నేహ తర్వాత ఇండియాకి వచ్చి సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అకాడమిక్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కాలేజ్ మ్యాగజిన్ స్పెక్ట్రమ్ కి కూడా చీఫ్ ఎడిటర్ గా చేశారు స్నేహ.

ముందు వీళ్ళిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారట. తర్వాత వెయిట్ చేసి, ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అల్లు అర్జున్, స్నేహ. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు.

 


End of Article

You may also like