నటులు, నటుల భార్యలు కాస్ట్లీ కాస్ట్లీ దుస్తులు కట్టుకుంటూ వుంటారు. ఒక్కో సారి వాటి ధర ని చూస్తే మనం షాక్ అవుతూ ఉంటాము. అల్లు స్నేహా కూడా కాస్ట్లీ కాస్ట్లీ దుస్తులు కట్టుకుంటూ వుంటారు. గతం లో కూడా ఆమె ఓ సిల్వర్ శారీ వేసుకుంది. అది అప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

Video Advertisement

ఆ అందమైన సిల్వర్ శారీని లక్షా డబ్భై ఆరు వేల రూపాయలు. అయితే ఇప్పుడు కూడా స్నేహ ఖరీదైన డ్రెస్ ఒకటి వేసుకున్నారు.

సెలబ్రిటీలు కానీ సెలబ్రిటీల భార్యలు కానీ ఏదైనా అందమైన చీరలని కానీ ఏదైనా డ్రెస్ ని కానీ ధరించారంటే దాని గురించి నెటిజన్లు వివరాలను సేకరిస్తూ ఉంటారు. తాజాగా స్నేహ వేసుకున్న దుస్తుల ఖరీదు కూడా బయట పడింది. మరి వాటి విలువ ఎంతనేది చూస్తే.. స్లిప్ డ్రెస్ ధర రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందలు (2,49,500) అని తెలుస్తోంది.

అనితా డోంగ్రే డిజైన్ చేసిన లెహంగా అయితే లక్షా యాభై వేలు (1,50,000) అని తెలుస్తోంది. అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఈ లెహంగా తో ఆమె మరెంత అందంగా వున్నారు. క్యూటీ నుండి బ్యూటీగా మారిందని బన్నీ అన్నారు. స్నేహా తన ఫ్రెండ్ పెళ్లి కి బన్నీ తో పాటు సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ స్నేహ అనితా డోంగ్రే డిజైన్ చేసిన ఈ స్టైలిష్ లెహంగా వేసుకున్నారు.

స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్నేహ సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మ్యాగజిన్ స్పెక్ట్రమ్ కి చీఫ్ ఎడిటర్ గా చేస్తున్నారు, అంతే కాకుండా కాలేజ్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా స్టూడియో పికాబూ పేరుతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో కూడా స్థాపించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతుంటారు స్నేహ. అలానే కుటుంబానికి సంబంధించి విషయాలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు.