Ads
చైనా తమ దేశంలో పెరుగుతున్న వ్యతిరేకత నుండి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం భారత్ తో లడక్ లడాయి పెట్టుకుంది.కాని ఈ లడాయి చైనా కు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా పని చేసింది.చైనా ధోరణి భారత్ ప్రజలలో చైనా పట్ల విరక్తి, అసహ్యన్ని పెంచాయి.అందుకే భారతీయులు స్వచ్ఛందంగా చైనా ప్రొడక్ట్స్ ని చాలావరకు బాయ్ కాట్ చేస్తున్నారు.
Video Advertisement
అందుకే భారత్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆన్ లైన్ షాపింగ్ ల వైపు మొగ్గుచూపుతున్నారు అందుకే ఇక నుండి ఈ- కామర్స్ సైట్స్ అమ్మే ఉత్పత్తులు ఎక్కడ తయారైయ్యోయో అన్న వివరాలను వినియోగదారులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా జరిగిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ- కామర్స్ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.
భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ- కామర్స్ సంస్థలన్ని స్వాగతించాయి.అలాగే తమకు కొంత టైం కావాలని ప్రభుత్వాన్ని కోరాయి.దీని పై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిపి కొంత గడువును ఇస్తామని ఈలోపు ఈ- కామర్స్ సంస్థలు తాము చెప్పిన మార్గదర్శకాలను పాటించాలని అలా పాటించని యెడల వారి పై కఠిన చర్యలు తప్పవని సమావేశంలో పేర్కొన్నది.
ఇండియా ఉన్నట్టుండి తమ వాణిజ్యానికి గండి కొట్టేలా నిర్ణయాలు తీసుకోవడంతో చైనా తమ దేశంలో సడన్ గా ఉన్నత స్థాయి సమావేశాలకు పిలుపునిచ్చింది.
End of Article