Ads
ఎన్నో రోజుల వెయిటింగ్ తర్వాత నిన్న రాత్రి నాని 25 వ సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. చాలా మంది రాత్రే సినిమా చూశారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన వి సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇదలా ఉంచితే వి సినిమా సెప్టెంబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత విడుదలవ్వాల్సి ఉందట.
Video Advertisement
కానీ అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం చిత్ర బృందానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 10 గంటలకు విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, అన్ని మాధ్యమాల్లో ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల అవుతుందనే ప్రకటించారు. కానీ సెప్టెంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటలకి అమెజాన్ ప్రైమ్ లో వి సినిమా స్ట్రీమింగ్ మొదలైంది.
12 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 5వ తేదీ రోజు నాని నటించిన మొదటి సినిమా అష్టాచమ్మా రిలీజ్ అయింది. కాబట్టి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల చేయాలి అని అనుకున్నారట. కానీ సినిమా ముందు రోజు రాత్రే విడుదలవడం తో చిత్ర బృందం మొత్తం షాక్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
End of Article