Home Filmy Adda ఇంస్టాగ్రామ్ ఈ అమ్మాయి లైఫ్ నే మార్చేసింది… ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇంస్టాగ్రామ్ ఈ అమ్మాయి లైఫ్ నే మార్చేసింది… ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

by Mohana Priya

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సినిమాకి ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటించారు.

ఈ మధ్య తెలుగు అమ్మాయిలకి మంచి అవకాశాలు వస్తున్నాయి. శివాని కూడా తెలుగు అమ్మాయే కావడం విశేషం. ఈ సినిమా గురించి శివాని మీడియాతో మాట్లాడారు. సినిమా చూసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నాను అని అన్నారు.

ambajipeta marriage band heroine shivani audition

“ఇంస్టాగ్రామ్ లో ఆడిషన్స్ కి రమ్మని ఒక మెసేజ్ పెట్టారు. ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా ఇంకొక క్యారెక్టర్ అనుకోని ఆడిషన్స్ కి వెళ్ళాను. ఆడిషన్ చేశాక వివరాలు తర్వాత చెప్తాము అని అన్నారు. ఆ తర్వాత కాల్ చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో హీరోయిన్ నేనే అని చెప్పారు. ఈ విషయం నాకు నమ్మబుద్ధి కాలేదు. షూటింగ్ సెట్స్ కి వెళ్ళాక కూడా అలాగే అనిపించేది. కానీ ఆ తర్వాత సినిమా బృందం హీరోయిన్ నేనే అని చెప్పి సీన్స్ షూట్ చేశాక నాకు నమ్మకం కుదిరింది” అని శివాని చెప్పారు. దుష్యంత్ కాటికనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ambajipeta marriage band heroine shivani audition

ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ కూడా మరొక ముఖ్య పాత్రలో నటించారు. గోపరాజు రమణ కూడా ఈ సినిమాలో నటించారు. ఒక ఊరిలో జరిగే ఒక యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. అతని ప్రేమకథ ఎలా ఉంటుంది? ఆ ఊరిలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే స్టోరీ మీద ఈ సినిమా నడుస్తుంది.

scene from ambajipeta marriage band trailer

సినిమాలో ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్ కూడా ఉంటాయి అని దర్శకుడు చెప్పారు. ఇటీవల గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే కనిపిస్తోంది. ట్రైలర్ లో ఉన్న సీన్స్ చూస్తూ ఉంటే సినిమా చాలా సహజంగా తీశారు అని అర్థం అవుతోంది. ఇంకా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని ఎంతవరకు అందుకుంటుందో తెలియాలి అంటే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.

ALSO READ : అప్పుడు RGVని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఇప్పుడు ఎంపీగా పోటీ… వైసీపీ ప్లానింగ్ మాములుగా లేదుగా?

You may also like