కళ్యాణ్ రామ్ “అమిగోస్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

కళ్యాణ్ రామ్ “అమిగోస్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా అమిగోస్. ఈ సినిమాకి రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. ఇందులో చాలా మంది ప్రముఖ నటినటులు ఉన్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ ఇటీవల జరిగింది. ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు ఉంది అని వార్తలు వచ్చాయి. సినిమాకి యు/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

Video Advertisement

సినిమా నుండి విడుదల అయిన పాటలు అలాగే సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. ఈ సినిమా సెన్సార్ టాక్ ఇదే అంటూ ఒక వార్త వచ్చింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుంది అని అన్నారు.

amigos censor review

అలాగే సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం కళ్యాణ్ రామ్ పోషించిన మూడు పాత్రలు. అందులోను కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర సినిమా మొత్తానికి చాలా పెద్ద ప్లస్ అయ్యింది అని అన్నారు. సినిమా కథనం కూడా చాలా బాగుంది అని, సినిమా సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంది అని అన్నారు అని సమాచారం. అంతే కాకుండా సినిమా నిడివి కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. దర్శకుడు సినిమాని చాలా బాగా రూపొందించారు అని అన్నారు.

amigos censor review

సెన్సార్ టాక్ ఇదే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసే హీరోలలో ఒకరు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ చేసే ప్రతి సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. గత సంవత్సరం బింబిసార సినిమాతో హిట్ కొట్టారు. సోషియో ఫాంటసీ సినిమాకి యాక్షన్ కూడా యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు.

amigos censor review

ఇప్పుడు ఈ సినిమా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ అని అర్థం అవుతోంది. ఇందులో మూడు పాత్రల్లో ఉన్న తేడాని చూపించడానికి కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు. పాత్ర మేకోవర్ కూడా చాలా కొత్తగా ఉంది. మరి సినిమా సెన్సార్ టాక్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like