రాను రాను ఐపీఎల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఐపీఎల్ ప్రారంభంలో చాలా డల్ గా ఉన్నా.. మ్యాచ్ లు జరుగుతున్న కొలది ఈ లీగ్ పై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా లేకపోవడంతో స్టేడియంలోకి కూడా చాలామంది ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. అయితే స్టేడియంలోకి వచ్చే కొంతమంది ప్రేక్షకులు చేసే పనులు కెమెరాల కనబడుతున్నాయి.

Video Advertisement

ఈ విధంగానే ఒక జంట చాలా చక్కగా కెమెరాకు చిక్కింది. అయితే వాళ్లు సాధారణంగా కూర్చుని మాత్రం కాదు.. లిప్ లాక్ కిస్ లు ఇచ్చుకుంటూ కెమెరాలో చిక్కారు.

kisses 1

శనివారం గుజరాత్ టైటాన్స్ కు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ అయిదవ ఓవర్ నడుస్తున్న సమయంలో ఒక జంట స్టాండ్ పై కూర్చొని ఎంచక్కా ముద్దులు ఇచ్చుకుంటూ కెమెరాలో చిక్కారు. ఈ క్రమంలోనే వారు ముద్దు పెట్టుకున్నప్పుడు తీసినటువంటి ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ని చూడడానికి స్టేడియానికి వస్తున్నారా..

kisses

లేకుంటే ముద్దులు పెట్టుకోవడానికా.. వీరికి ఇంకెక్కడ ప్లేస్ లేదా అంటూ నెటిజన్లు కామెంట్లతో అదరగొడుతున్నారు. ఈ ఫోటోని చూసి స్పందించిన ప్రముఖ ఎంటర్ ఫ్రీన్యూర్ చిరాగ్ బర్జత్య.. ఐపీఎల్ మ్యాచ్లలో కిస్ కెమెరాలను ఏర్పాటు చేయాలని చమత్కరిస్తూ కామెంట్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపైన నెటిజన్లు కూడా స్పందించి మ్యాచ్ చూడడానికే కాకుండా.. ఇలాంటి సీన్లు కూడా చూడడానికి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.