Ads
కానిస్టేబుల్ గా తన విధులను నిర్వహిస్తూనే మాతృమూర్తి గొప్పతనాన్ని నిరూపించింది
నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. దేశాన్ని ఏలే నేత గా ఉన్నా, సాధారణం అయిన మహిళ అయినా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఒక తల్లికి తన పిల్లల తరువాతే ఏదైనా, అదే విషయం మరొకసారి రుజువు అయ్యింది.ఉత్తరప్రదేశ్ కి చెందిన నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీమతి ప్రీతీ రాణి.
Video Advertisement
అయితే సోమవారం నాడు నోయిడా లోని కొన్ని కార్యక్రమానికి, అభివృద్ధి పనులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రావాల్సి ఉండగా అ కార్యక్రమంకి ప్రీతి రాణి ని సెక్యూరిటీగా వేశారు. ఆమె విధులకు ఉదయం 6 గంటలకె హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో ఆమె భర్తకు ఎక్సమ్ ఉండటంతో ఏడాదిన్నర వయస్సు ఉన్న తన కుమారుడిని చంకన వేసుకునే ఆమె విధులకు హాజరు అయ్యారు. తన కుమారుని చూసుకునేందుకు వేరే ఎవరూ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తనతో పాటు తీసుకుని వచ్చాను అని, తల్లిగా తన కుమారుని చూసుకొనే బాధ్యత కూడా తనపై ఉందని ఆమె తెలిపారు. ఈ విషయం అక్కడ ఉన్నవారందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్ గా మరి సంచరిస్తున్నాయి.
End of Article