Mahesh Babu : “ఎవరు మీలో కోటీశ్వరులు”లో మహేష్ బాబు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా.? దాంతో ఏం చేయబోతున్నారంటే..?

Mahesh Babu : “ఎవరు మీలో కోటీశ్వరులు”లో మహేష్ బాబు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా.? దాంతో ఏం చేయబోతున్నారంటే..?

by Mohana Priya

Ads

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Video Advertisement

అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు అనే వార్త ఎప్పుడో బయటికి వచ్చింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

amount won by mahesh babu in evaru meelo koteeswarulu

దాంతో మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జెమినీ టీవీ బృందం ఇటీవల మహేష్ బాబు ఎపిసోడ్ త్వరలో రాబోతోంది అని ఒక ప్రోమో విడుదల చేసింది. అందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా మాట్లాడుకోవడం మన ప్రోమో లో చూడొచ్చు. అయితే ఈ ప్రోగ్రాం లో మహేష్ బాబు ఎంత గెలుచుకున్నారు అని ఒక ఆసక్తి నెలకొంది. ఈ ప్రోగ్రాంలో మహేష్ బాబు 25 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. ఆ మొత్తాన్ని కూడా మహేష్ బాబు చారిటీకి ఇవ్వబోతున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో ఇంకా జెమినీ టీవీ యాజమాన్యం ప్రకటించాల్సి ఉంది.


End of Article

You may also like