బ్రేకింగ్: కుప్పకూలిన అమృత…హాస్పిటల్ కి తరలింపు…!

బ్రేకింగ్: కుప్పకూలిన అమృత…హాస్పిటల్ కి తరలింపు…!

by Sainath Gopi

మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.

తాజాగా అమృత స్పృహ తప్పి పడిపోయారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆమె నివాసంలో ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూ సమయంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబసభ్యులు అమెను వెంటనే 108 వాహనం ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అమృత తండ్రి, ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత నిన్న ఇలా స్పందించింది.. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు.ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రితో ఎప్పుడు కలవలేదని, కనీసం చూడలేదని తెలిపింది. ఇక చేసిన తప్పును తెలుసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నారేమో అని వ్యాఖ్యానించింది అమృత.

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. “తల్లీ అమృత.. అమ్మ దగ్గరికి వెళ్ళిపో”. అని రాసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అందులో రాసారు అంట. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు,దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య విషం తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు అని తెలుస్తుంది.

 

You may also like