అమృతం2 ప్రోమోలో అంజిగా గుండు హనుమంత్ రావు ని మిస్ అవుతున్న ఓ అభిమాని పంపిన మెసేజ్ ఇది! చూస్తే కన్నీళ్లొస్తాయి.!

అమృతం2 ప్రోమోలో అంజిగా గుండు హనుమంత్ రావు ని మిస్ అవుతున్న ఓ అభిమాని పంపిన మెసేజ్ ఇది! చూస్తే కన్నీళ్లొస్తాయి.!

by Megha Varna

Ads

కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని సార్లు భోజనం చేసిన బోర్ కొట్టదు అనేది ఎంత వరకు వాస్తవమో తెలియదు కాని…అమృతం సింగల్ ఎపిసోడ్ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అనడంలో మాత్రం అతిశయోక్తి ఏం లేదు.

Video Advertisement

అమృతం రావు అమాయకత్వం, ఆంజనేయులు ఐడీయాలు, అప్పాజీ పెనాల్టీలు, సర్వం అరవ గోలలు. క్యారెక్టర్ కి తగ్గట్టుగా కామెడీ ఉంటుంది కానీ…ఈ సీన్ లో కామెడీ రావాలి అని రాదు. అందుకే ఆ సీరియల్ కి చిన్న పెద్దా తేడా లేకుండా ఫాన్స్ అయిపోతూ ఉంటారు.

ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు అనే పాటతో స్టార్ట్ చేసారు…కాని ఇలా మీరు లేని అమృతం చూడాల్సి వస్తుంది అన్న రోజు వస్తుంది అనుకోలేదు ఆముదాల ఆంజనేయులు గారు అలియాస్ గుండు హనుమంత రావు గారు. వినపడలే వినపడలే అంటూ “అహ నా పెళ్ళంటా” లో నవ్వించారు..కాని మరణించి మూగబోయి హాస్యాన్ని దూరం చేసారు…అభిమానులతో కంట తడి పెట్టించారు.

చిన్నప్పుడు ఆదివారం అంటే మధ్యాహ్నం భోజనంలో నాన్-వెజ్ ఉండాలి…రాత్రికి టీవీలో అమృతం సీరియల్ చూసి పాడుకోవాలి. ఆ ఒక్క రోజు అమృతం ఎపిసోడ్ చూడటం వల్ల వారం మొత్తం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ లో అన్ని ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత రిపీట్ మోడ్ ఆన్ చేసుకొని మరీ చూస్తున్నాము. టెన్షన్ నుండి మంచిగా రిలాక్స్ అవ్వాలి అంటే అమృతం చూడాలి మైండ్ లో ఫిక్స్ అయ్యేలా చేసారు మీరు.

ప్రస్తుతం మీరు స్వర్గంలో ఉండే వారికి మీ హాస్యంతో నిజమైన స్వర్గం అంటే అమృతం సీరియల్ చూడటం అని నిరూపిస్తున్నారు అనుకుంట. మీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని సంబరపడి అమృతం 2 మొదలవుతుంది అనుకోని సంబరపడ్డాం. కాని అంజి వంటకాలు ఇకపై స్వర్గంలో ఉన్న వారు రుచి చూస్తారు అనుకోలేదు. మీరు వెళ్లిపోయారని తెలియగానే ఎదో నాకు చాలా పరిచయం ఉన్న నా అనే వ్యక్తి ని పోగొట్టుకున్నట్టు ఉంది . మీకు నాకు అసలేలాంటి పరిచయం లేకున్నా మన ఇద్దరు అనుబంధం 2001 నుండి కొనసాగుతుంది. మీతో సంబంధం కంటే ఆముదాల ఆంజనేయులుతో సంబంధం ఎక్కువ బలపడే చేసారు మీరు. సీరియల్ ఆగిపోయినా ఇప్పటికి బ్రేక్ దొరికితే అమృతం చూస్తూనే ఉన్నా…కామెడీ సీన్స్ గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నా..! మా బాల్యాన్ని అమృతంతో స్పెషల్ గా చేసినందుకు థాంక్ యు సార్.!

ఇప్పుడు అంజి పాత్రలో ఎల్.బి శ్రీరామ్ గారు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన సీసన్ 2 ప్రోమో చూడగానే మొదటి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అమృతం అభిమానులు.

ఇట్లు,
ఎప్పటికి అమృతం సీరియల్ రిపీట్ మోడ్ లో చూసే ఓ అభిమాని,

watch video:


End of Article

You may also like