Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల లోకల్ ట్రాన్స్పోర్ట్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. కొంచెం దూరం ప్రయాణించాల్సి ఉన్నా కూడా డ్రైవర్లు ఆస్తులు అడుగుతున్నారు. అంటే అంత ఎక్కువ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అని అర్థం. ఒక అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని కూడా మర్చిపోయి పేషంట్లని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించిన ఈ సంఘటన ఇటీవల కోల్‌కతా లో చోటుచేసుకుంది.
Video Advertisement
కోల్‌కతా కు చెందిన ఒక వ్యక్తికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఒకరి వయసు తొమ్మిదిన్నర సంవత్సరాలు మరొకరి వయస్సు 9 నెలలు. ఇద్దరికీ ఇటీవల కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఇద్దరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లల్ని ఐ సి హెచ్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్) నుండి కోల్‌కతా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేర్చడానికి అంబులెన్స్లో తీసుకెళ్దాం అనుకున్నారు తండ్రి.
ఐ సి హెచ్ నుండి కోల్‌కతా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి అంబులెన్స్ మాట్లాడుకున్నారు. వాళ్లు ఎక్కిన చోట నుండి దిగే చోటు వరకు ఉన్న దూరం 6 కిలోమీటర్లు మాత్రమే. ఆరు కిలోమీటర్ల దూరానికి అంబులెన్స్ డ్రైవర్ అడిగిన మొత్తం 9,200 రూపాయలు. దాంతో పిల్లల తండ్రి అంత చెల్లించలేను అని చెప్పి తగ్గించమని బతిమిలాడినా కూడా ఆ డ్రైవర్ వినలేదు.
అంతేకాకుండా రెండవ పిల్లాడికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి అంబులెన్స్ లో నుండి దిగమని బలవంతం చేశాడు. దాంతో ఆ ఇద్దరు పిల్లలు ఇంకా తల్లి అంబులెన్స్ నుండి దిగారు. ఇదంతా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాడు ఆ పిల్లల తండ్రి. దాంతో డాక్టర్లు జోక్యం చేసుకొని అంబులెన్స్ డ్రైవర్ తో మాట్లాడి 2000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు.
తన పిల్లలు సరైన చికిత్స పొందడానికి కారణం డాక్టర్లే అనిమెరుగైన చికిత్స కోసం కోల్‌కతా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తరలించడానికి సహాయం చేశారు అని ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఆ ఆ తండ్రి.
End of Article