కాలం మారుతున్నా టెక్నాలజీ పెరిగిపోతున్నా సమస్యలు సమస్యలనే ఉండిపోతున్నాయి. వరకట్న వేధింపుల సమస్య కొత్తేమీ కాదు. ఎంతో మంది ఆడపడుచులు వరకట్న సమస్యకి బలైపోయారు. వరకట్న వేధింపులను భరించలేక మృత్యువే నయం అనుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

Video Advertisement

తాజాగా వరకట్న వేధింపులు భరించ లేక ఒక యువతి తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించింది. అది ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే…

న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, ఖానా పూర్ మండల కేంద్రానికి చెందిన యువతి నూర్జహాన్. పురుగుల మందు తాగి నూర్జహాన్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే నూర్జహాన్ కి తన భర్త కి ఏడాది క్రితం వివాహం అయ్యింది. కొన్ని రోజులు హైదరాబాదు లో ఉన్నారు తర్వాత వరంగల్ వచ్చేసారు. అత్తమామలతోనే కలిసి ఉంటున్నారు. అయితే భర్త మరియు అత్తమామలు కలిసి వరకట్నం కోసం విధిస్తుంటే ఆమె భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

representative image

పోలీసులు మాత్రం అత్తమామల దగ్గర నుంచి లంచం తీసుకుని ఆమె సమస్యని తీర్చ లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగింది. ఈమె పురుగుల మందుని తీసుకోక ముందే భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ తరవాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీనితో వెంటనే బాధితురాలని వరంగల్లోని ఎంజీఎం కి తరలించారు.

representative image

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేవలం వరకట్న వేధింపులు వల్లనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. గతంలో అయితే కట్నం తేలేదని రెండు సార్లు అబార్షన్ కూడా చేయించారు ఈ విషయాన్ని బాధితురాలు మేనమామ మీడియా తో చెప్పడం జరిగింది. ఆమె ప్రాణానికి ఏమైనా అయితే భర్త అత్తమామల పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.