Ads
ముత్యాల వెంకటేశ్వరరావు పరిచయం అవసరం లేని పేరు అనకాపల్లి ఏరియాలో ఈయన మంచితనం గురించి తెలియని వారు ఉండరు. టెక్స్ టైల్స్ వ్యాపార రంగంలో గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో అభివృద్ధి సాధించినటువంటి వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితమైనటువంటి ఎంవీఆర్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Video Advertisement
ఈయన రాజకీయాలలోకి రాకుండానే అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు చేశారు పెద్ద ఎత్తున పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. సంవత్సరంలో 6 నెలలు హోమాలు యాగాలు వంటివి చేస్తూ ఉంటారు. ఎంతోమంది నిరుద్యోగకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. ఆపద అని వస్తే ఈయన తానున్నానంటూ సహాయం అందించారు .ఇలా ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో మంది ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త తమ పార్టీలోకి వస్తే పార్టీకి ఆర్థికంగా సహాయంగా ఉండటమే కాకుండా తప్పకుండా విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
ఇలా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడానికి టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నప్పటికీ మరోవైపు జనసేన నేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి టికెట్ తన సోదరుడు నాగబాబుకు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. మరి ఈ ఎంపీ టికెట్ కోసం మరికొందరు కూడా పోటీకి వస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తే ఎంవిఆర్ రాజకీయాలలోకి వస్తారా అసలు రాజకీయ ఎంట్రీ పై ఆయన మనసులో ఏముందనే విషయాల గురించి తెలియాల్సి ఉంది.
End of Article