ఆనం వెంకటరమణా రెడ్డి గారు చెప్పిన విషయం మంచిదే కదా..? తిరుపతిలో ఇలాగే ఉండాలి కదా..?

ఆనం వెంకటరమణా రెడ్డి గారు చెప్పిన విషయం మంచిదే కదా..? తిరుపతిలో ఇలాగే ఉండాలి కదా..?

by Harika

Ads

ప్రదేశానికి తగ్గట్టుగా నియమాలు ఉంటాయి. కొన్నిచోట్ల నియమాలు పాటించడం తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని చోట్ల అలాంటివి పాటిస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గుళ్ళలో ఉన్నప్పుడు కొన్ని విషయాలని తప్పకుండా పాటించాలి. ఆ విషయాలను పాటించమని మనకు ఎవరు చెప్పరు. అలా పాటించడం సరైనది అని అనుకుంటారు. గుళ్ళలో కొన్ని నిబంధనలు ఉంటాయి. కొని లేకపోయినా కూడా పాటిస్తారు. తిరుపతిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వస్త్రధారణ విషయంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ కొన్ని నిబంధనలు తిరుపతిలో పాటిస్తారు. సెలబ్రిటీలు కూడా తిరుపతికి వెళ్తూ ఉంటారు. వారు వెళ్ళినప్పుడు మీడియా కవరేజ్ అనేది సర్వసాధారణం.

Video Advertisement

anam venkatatamanareddy about tirupati rule

తిరుపతికి సెలబ్రిటీలు వెళ్లినప్పుడు ఛానల్స్ వారు, పేపర్ వారు వెళ్లి ఆ సెలబ్రిటీలను కవర్ చేయడం మాత్రమే కాకుండా కొంత మందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ వారు సినిమా రంగానికి చెందిన వారు అయితే, సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇతర రంగాలకు చెందిన వాళ్లు అయితే, వారి రంగాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ దేశంలో ఏదైనా విషయం గురించి చర్చ నడుస్తూ ఉంటే ఆ విషయం మీద కూడా ప్రశ్నలు అడుగుతారు.

కొంత మంది సెలబ్రిటీలు సమాధానాలు చెప్తారు. కొంత మంది తర్వాత మాట్లాడతాం అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే, ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అయిన ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక నిబంధనని ప్రవేశపెట్టడం చేశారు. తిరుపతికి వెళ్ళినప్పుడు గోవింద నామస్మరణ తప్ప మిగిలిన ఏ విషయాలు గురించి మాట్లాడకూడదు అని అన్నారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడకూడదు అని అన్నారు. ఈ విషయం మీద తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఏదైనా ఒక వీడియో తిరుపతిలో తీసిన వీడియో అయితే, అందులో రాజకీయాలకు సంబంధించిన మాటలు ఏదైనా జరుగుతూ ఉంటే, ఆనం వెంకటరమణారెడ్డి గారు ఆ వీడియో షేర్ చేసి, “పాలిటిక్స్ గురించి తిరుపతిలో మాట్లాడకూడదు అండి” అని చెప్తున్నారు. కొంత కాలం క్రితం నటుడు శివాజీ తిరుపతికి వెళ్లారు. శివాజీని మీడియా ఇంటర్వ్యూ చేస్తూ, రాజకీయాలు గురించి మాట్లాడింది. ఈ వీడియోని ఆనం వెంకటరమణా రెడ్డి గారు షేర్ చేసి, “పాలిటిక్స్ వద్దు సార్. ఎన్ని సార్లు చెప్పాలి మీకు” అని కామెంట్ పెట్టి షేర్ చేశారు. దాంతో ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పిన మాటకి మద్దతు ఇస్తూ చాలా మంది ఆయన నిర్ణయం సరైనది అని అంటున్నారు.


End of Article

You may also like