ఇండియాను అవమానించాలని చూసిన చైనా జర్నలిస్ట్ కి…మహీంద్రా ఛైర్మన్ హైలైట్ కౌంటర్!

ఇండియాను అవమానించాలని చూసిన చైనా జర్నలిస్ట్ కి…మహీంద్రా ఛైర్మన్ హైలైట్ కౌంటర్!

by Mohana Priya

Ads

చైనా పేరు చెప్తే మిగిలిన దేశాలన్నింటికీ కోపం వచ్చేలా తయారయ్యింది పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతదేశానికి. కరోనా, గాల్వాన్ ఘటన వల్ల చైనాతో భారతదేశానికి గొడవలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇటీవల భారతదేశ ప్రభుత్వం చైనా తయారుచేసిన 59 అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లో నుండి తొలగించింది. ఇందులో 58 అప్లికేషన్లు ఒక ఎత్తైతే, జనాలకి మత్తు మందు లాగా ఎక్కిన టిక్ టాక్ యాప్ మరొక ఎత్తు.

Video Advertisement

టిక్ టాక్ కి భారత దేశ ప్రజలు ఎంతగా అడిక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. దాంట్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఎన్నో లైక్స్ వస్తాయి. వాటిని జనాలు అంతే సీరియస్ గా తీసుకుంటారు. అలా కొన్నివేల లైకులు, ఫాలోవర్లు వచ్చిన ఎంతోమంది తాము ఎంతో కష్టపడి పైకి వచ్చిన స్టార్ల లాగా ఫీల్ అవుతూ ఉంటారు.టిక్ టాక్ వాడుతున్న వాళ్లలో చాలామంది భారతదేశం వాళ్లే. ఇది తెలిసి టిక్ టాక్ సంస్థాపకుడు భారత దేశ ప్రజలు అంత పని పాట లేకుండా ఉన్నారు అని ఎగతాళి చేశాడు. అతని మాటకి తిరిగి సమాధానం చెబుతూ ఆప్ కి ప్లే స్టోర్ లో తక్కువ రేటింగ్ ఇచ్చారు భారత దేశ ప్రజలు.

వాళ్ల యాప్ ని వాడుతున్నా వాళ్లకు బాధే వాడకుండా బ్యాన్ చేసినా కూడా బాధే. మొన్నటి వరకూ టిక్ టాక్ వాడినందుకు ఎగతాళి చేశారు ఇవాళ బ్యాన్ చేసినందుకు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ప్లే స్టోర్ లో యాప్లు అన్నీ బ్యాన్ చేసినందుకు ఒక చైనా పత్రిక ఎడిటర్ ట్విటర్లో ఈ విధంగా స్పందించాడు.

“భారతదేశం చైనా వస్తువులు అన్నిటిని బ్యాన్ చేసింది. అందుకని చైనా వాళ్లు కూడా భారతదేశం నుండి వచ్చేవి బ్యాన్ చేయాలి. కానీ ఒకవేళ అలా చేయాలి అని అనుకున్నా కూడా భారతదేశం నుండి వచ్చే వస్తువులు ఎక్కువగా ఏం లేవు. మీరు నేషనలిజం కంటే ఎక్కువగా పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి” అని ఆ ట్వీట్ సారాంశం.దానికి బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ విధంగా స్పందించారు.

“నాకు తెలిసి ఇప్పటివరకు భారతదేశం అందుకున్న కామెంట్ల లో చాలా ప్రభావితం చేసే, ప్రేరేపించే కామెంట్ ఇదే. ఇలా మమ్మల్ని రెచ్చగొట్టినందుకు ధన్యవాదాలు. చాలా తొందరలో మేము ఆ స్థాయికి ఎదుగుతాం” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు.

స్వదేశీ వస్తువులని, టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు. టిక్ టాక్ లాగానే ఉండే చింగారి అనే యాప్ భారతదేశంలో తయారు చేశారు అని తెలిసి ఆయన వంతు ప్రోత్సహించడానికి ఆ ఆప్ ను ఇన్స్టాల్ చేసుకున్నారు. తాను అసలు టిక్ టాక్ వాడలేదు అని కానీ ఇది భారతదేశం ది కాబట్టి ఈ ఆప్ ను డౌన్లోడ్ చేశాను అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.


End of Article

You may also like