కొడుకు టెన్త్ పరీక్ష కోసం 106 కి.మీలు సైకిల్ తొక్కిన తండ్రి…ఆ ఇద్దరికి ఆనంద్ మహీంద్రా ఆఫర్.!

కొడుకు టెన్త్ పరీక్ష కోసం 106 కి.మీలు సైకిల్ తొక్కిన తండ్రి…ఆ ఇద్దరికి ఆనంద్ మహీంద్రా ఆఫర్.!

by Mohana Priya

Ads

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన కంపెనీ గురించి అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అని పోస్ట్ ఏదైనా కనిపిస్తే వాళ్ళకి సహాయం చేయడం, లేదా ఎవరైనా సామాజిక దృక్పథంతో ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని అభినందించడం కూడా చేస్తూ ఉంటారు.

Video Advertisement

మధ్యప్రదేశ్ లోని ధర్ జిల్లా కి చెందిన శోభా రామ్ అనే వ్యక్తి ఒక రోజువారి ఉద్యోగి. శోభా రామ్ వృత్తి వ్యవసాయం అయినా కూడా ఇలా రోజు వారీ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. శోభా రామ్ కి ఆశిష్ అనే కొడుకు ఉన్నాడు. ఆశిష్ పదవతరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్ష సెంటర్ వాళ్ళు ఉండే చోటికి దాదాపు 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు కూడా నడవట్లేదు అన్న విషయం మనందరికీ తెలుసు.

పరీక్ష మంగళవారం నాడు ఉంది. కానీ అంత దూరం వెళ్ళాలి కాబట్టి శోభా రామ్ ఇంకా ఆశిష్ ధర్ నుండి సోమవారం మధ్యాహ్నం సైకిల్ మీద బయలుదేరారు. పరీక్ష మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు వాళ్లు ఎగ్జామినేషన్ సెంటర్ కి చేరుకున్నారు.

బుధవారం నాడు ఆశిష్ కి సోషల్ పరీక్ష ఉంది. మళ్లీ వెనక్కి వెళ్లి రావడం కష్టం, ఇంకా ఇక్కడ ఉండటానికి కూడా చోటు లేదు, తెలిసిన వాళ్లు కూడా లేకపోవడంతో మూడురోజుల భోజనాన్ని ముందే తెచ్చుకున్నారు.

ఇదంతా ఒక న్యూస్ ఆర్టికల్ రూపంలో ప్రచురించారు. ఆ న్యూస్ ఆర్టికల్ చదివిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా శోభా రామ్ ని అభినందించారు. శోభా రామ్ తన పిల్లల కోసం ఎంతో పెద్ద కలలు కన్నాడు అని,

దేశ పురోగతికి ఇలాంటి సంఘటనలు స్ఫూర్తిని ఇస్తాయి అని, తన సంస్థ మహీంద్రా రైజ్ ద్వారా ఆశిష్ చదువుకి మద్దతు ఇస్తానని, శోభా రామ్ తో తనని మాట్లాడించమని ఈ న్యూస్ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ ని అడిగారు.


End of Article

You may also like