“ఆనంద్” లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో చూడండి.!

“ఆనంద్” లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో చూడండి.!

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న టైంలో వచ్చిన సినిమా ఆనంద్. ఆ సమయంలో తెలుగులో ఆనంద్ లాంటి సినిమాలు రావడం తక్కువే. సినిమా సింపుల్ గా, డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఆనంద్ సినిమాని ఆదరించారు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ సినిమాలో నటీనటుల క్యారెక్టరైజేషన్. ప్రతి పాత్ర మనం రోజూ చూసే వాళ్ళలాగా అనిపిస్తారు.

Video Advertisement

దాంతో ఈ సినిమాకి ప్రేక్షకులు ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ల ఇంట్లో ఉండే సమత పాత్రలో నటించిన అమ్మాయి మనకి గుర్తు ఉండే ఉంటుంది. తన పేరు బఖితా ఫ్రాన్సిస్. ఈ సినిమాలో తన నటనకి బఖితా ఫ్రాన్సిస్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆనంద్ సినిమా విడుదలయ్యి ఎన్నో సంవత్సరాలు అయ్యింది.

కానీ బఖితా, ఆనంద్ తర్వాత వేరే ఏ సినిమాలోనూ కనిపించలేదు. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు. కొంత మంది మాత్రం సినిమాలకి దూరంగానే ఉంటారు. చిన్నప్పుడు కేవలం ఒక హాబీ లాగా మాత్రమే సినిమాలు చేస్తారు. బఖితా ఫ్రాన్సిస్ ఇదే కోవకు చెందుతారు.

తెలుగు డెస్క్ కథనం ప్రకారం, బఖితా ఫ్రాన్సిస్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. అలాగే సమాజంలో ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్, ఇంకా ఆడవాళ్ళపై జరిగే హింసకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు బఖితా ఫ్రాన్సిస్. దాదాపు 17 సంవత్సరాల నుంచి బఖితా ఫ్రాన్సిస్ ఈ విషయాలపై పోరాటం చేస్తున్నారు. అలా తన కెరీర్ ని భిన్నంగా ఎంచుకున్నారు బఖితా ఫ్రాన్సిస్.


End of Article

You may also like