Ads
మర్యాద రామన్న వంటి సినిమాలతో ఫేమస్ అయిన హీరోయిన్ సలోని. మధ్యలో కొంత విరామం తీసుకున్న సలోని, ఇప్పుడు మళ్లీ తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : తంత్ర
- నటీనటులు : అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, మీసాల లక్ష్మణ్.
- నిర్మాత : నరేష్ బాబు పి, రవి చైతన్య
- దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
- సంగీతం : ఆర్ఆర్ ధృవన్
- విడుదల తేదీ : మార్చి 15, 2024
స్టోరీ :
రేఖ (అనన్య నాగళ్ళ) తల్లిని చిన్నతనంలోనే కోల్పోతుంది. తండ్రి చేతిలో తిట్లు తింటూ ఉంటుంది. రేఖకి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. రేఖ స్నేహితుడు తేజ (ధనుష్ రఘుముద్రి) అంటే రేఖకు ఇష్టం. తేజకి కూడా రేఖ అంటే ఇష్టం. అయితే, తర్వాత రేఖ మీద ఎవరో క్షుద్ర పూజలు చేశారు అని తేజకి అర్థం అవుతుంది. అలా చేసింది ఎవరు? విగతి (టెంపర్ వంశీ) 18 ఏళ్లు ఊరికి దూరంగా ఎందుకు ఉంటాడు? అసలు రాజేశ్వరి (సలోని) ఎవరు? తాను ప్రేమించిన రేఖని తేజ ఎలా కాపాడాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ మధ్య ఇలాంటి క్షుద్ర పూజలు, లేదా తాంత్రిక విద్యలు మీద వస్తున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. విరూపాక్ష నుండి మొదలు అయ్యి, తర్వాత ఇలాంటివి చాలా వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా అలాంటి జోనర్ సినిమానే. సినిమా స్టోరీ పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి. మొదటి నుండి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతున్నట్టు అనిపించదు. చివరిలో ఒక ట్విస్ట్ పెట్టారు. కానీ అది కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు.
అప్పటికే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇచ్చిన పాత్రల్లో అందరు బానే నటించారు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం సలోని చాలా బాగా నటించారు. ధ్రువన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. సినిమా కథ పేపర్ మీద బాగున్నా కూడా, వర్కింగ్ విషయంలో మాత్రం చాలా బలహీనంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ అయితే అనవసరంగా పెట్టారు ఏమో అనిపిస్తుంది.
వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని ఒక పాయింట్ చెప్పి వదిలేసి, మిగిలినది అంతా కూడా సినిమా డైరెక్టర్ ఎంచుకున్న తాంత్రిక విద్య అనే కాన్సెప్ట్ మీద నడిపిస్తే ఇంకా ఆసక్తికరంగా అనిపించేది. కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా అనిపిస్తాయి. సలోని నటన బాగుంటుంది. కానీ సలోని ట్రాక్ రాసుకున్న విధానం కూడా బాలేదు. అంత ఆసక్తికరంగా అనిపించదు. టేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- సలోని నటన
మైనస్ పాయింట్స్:
- స్లోగా సాగే స్క్రీన్ ప్లే
- బలహీనంగా రాసుకున్న సీన్స్
- హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్
- సలోని ఎపిసోడ్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు స్టోరీ లైన్ ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకునే వారికి తంత్ర సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
End of Article