టిక్ టాక్ వీడియోపై అనసూయ ఫైర్…ఎవర్ని తప్పుపెట్టాలో అర్థం కావట్లేదు.!

టిక్ టాక్ వీడియోపై అనసూయ ఫైర్…ఎవర్ని తప్పుపెట్టాలో అర్థం కావట్లేదు.!

by Megha Varna

Ads

తెలుగులో ఉన్న పాపులర్ యాంకర్స్ లో అనసూయ ఒకరు . జబర్దస్త్  యాంకర్ గా అందరికి సుపరిచితం .తాజాగా టిక్ టాక్ స్టార్ పై యాంకర్ అనసూయ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు .కాగా అనుసూయతో పటు కొంతమంది నెటిజన్లు కూడా అతని టిక్ టాక్ అకౌంట్ నిషేదించాలని కోరుతున్నారు ..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

 

షాబాద్ ఖాన్ అనే యువకుడు టిక్ టాక్ వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు .ఎంతలా అంటే అతను వీడియో అప్‌లోడ్  చేసిన క్షణాలలోనే వేల సంఖ్యలో వీక్షణలు వచ్చేంతలా ..అతను చేసిన వీడియోస్ లో సమాజానికి మేలు చేసేవి ఏమి లేకపోయిన యూత్ అంతా అతని టిక్ టాక్ వీడియోలను విపరీతంగా చూస్తున్నారు .

షాబాద్ ఖాన్ ను 11 మిలియన్ల కంటే ఎక్కువ మంది  అనుసరిస్తున్నారు ..ఈ నేపథ్యంలో అతను చేసిన ఓ వీడియో నెటిజన్లకు తీవ్ర కోపం తెప్పించింది ..కావున అతని టిక్ టాక్ అకౌంట్ ను బ్లాక్ చేయాలనీ కోరుతున్నారు ..


షాబాద్ ఖాన్ తన స్నేహితుడితో కలిసి రోడ్ మీద వెళ్తుంటారు. అలా వెళ్తుండగా షాబాద్ ఖాన్ చేయి ఓ యువతికి తగులుతుంది. ఆ యువతి అందుకు సీరియస్ అవుతుంది. సారీ చెప్పి ముందుకు వెళ్లిన ఈ టిక్  టాక్ స్టార్ తన అరచేతిపై ఉమ్మి వేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి, షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు. దీంతో అది ఆమెకు అంటుతుంది. అనంతరం హీరోలా అతడు తన స్నేహితుడితో కలిసి పోజులు కొడుతూ వెళ్ళిపోతాడు . ఆ వీడియో చుసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ..


కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి సోకకుండా అందరు సామజిక దూరం పాటిస్తుంటే ,ప్రభుత్వాలన్ని ఈ విధంగా నడుచుకోమని చెపుతూంటే షాబాద్ ఖాన్ ఇలాంటి వీడియో చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు ..

అయితే యాంకర్ అనసూయ కూడా నెటిజన్లకు మద్దుతుగా స్పందించారు .ఎవరిని  నిందించాలో నాకు తెలియడం లేదు.. ఇతడినా, ఇటువంటి వ్యక్తులను ఫాలో అవుతున్న వారినా.. ఇటువంటి వైరస్‌ లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇటువంటి వారిని జైల్లో వేయాలి.. షాబాద్ ఖాన్ అకౌంట్ ను తొలగించాలని నేను టిక్ టాక్ ఇండియాను కోరుతున్నాను అని అనసూయ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు .


End of Article

You may also like