యాంకర్ అనసూయ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న పేరు.తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం ఆమె .యాంకర్ గా ,నటిగా ఆమె కెరీర్ లో ముందుకు దూసుకుపోతుంది.సరైన ప్రణాళిక ద్వారా బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనసూయ.ఇక పొతే అనసూయ ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా కష్టాలు పడ్డారు .మరి ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.ఈమె ప్రేమ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.అనసూయ ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒకసారి NCC క్యాంపుకి వెళ్ళింది.ఆ క్యాంప్ మొత్తానికి అనసూయ నే కమాండర్ కావడంతో …ఎవరైనా రూల్స్ ని అతిక్రమిస్తే వారికి పనిష్మెంట్ కూడా ఇచ్చేదాన్ని అని చెబుతుంటారు అనసూయ ..

Video Advertisement

ఈ నేపథ్యంలో అదే క్యాంప్ కి వచ్చిన మరో విద్యార్థి భరద్వాజ్.అనసూయ ని చుసిన క్షణమే ప్రేమలో పడిపోయిన భరద్వాజ్ అసలు ఆలస్యం చెయ్యకుండా తన మసులో ఉన్న మాటను వెంటనే అనసూయకు చెప్పేసాడు . నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే ఇష్టం లాంటి మాటలు కాకుండా డైరెక్ట్ గా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను అని చెప్పేసాడు భరద్వాజ్.వెంటనే పెళ్లి అనేశాడేంటి అని ఆశ్చర్యపోయిన అనసూయ తర్వాత డైరెక్ట్ వచ్చి తన మనసులో మాట చెప్పేసిన భరద్వాజ్ ధైర్యానికి మనసు పాడేసుకుంది.

 

కానీ అప్పుడు అనసూయ తాను ఏమనుకుంటుందో అనే విషయం చెప్పకుండా క్యాంప్ నుండి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.తర్వాత కొంతకాలానికి మల్లి క్యాంప్ లో ఇద్దరు కలిసి మాట్లాడుకునే సమయానికి భరద్వాజ్ పై అనసూయకు కూడా మంచి ఇంప్రెషన్ కలిగిందంట.ఆ విధంగా వారిద్దరి మధ్య స్నేహం కుదిరిందని అనసూయ వెల్లడించారు.

క్రమంగా అది ప్రేమగా మారిందని ఈ విషయం మా అమ్మకు మాత్రమే చెప్పాను ఇప్పటిదాకా అని  అనసూయ తెలిపారు ..ఆ సమయంలో నాకు ఎక్కువగా సంబంధాలు వచ్చేవి అని వాటిని నేను రిజెక్ట్ చెయ్యడంతో నాన్నతో చాలా గొడవలు అయ్యాయి అని తెలిపారు అనసూయ.ఆ తర్వాత భరద్వాజ్ కోసం ఇంటి నుండి వచ్చేసి కొంతకాలం హాస్టల్ లో ఉంది అనసూయ.ఈ నేపథ్యంలో నాన్న పెళ్ళికి ఒప్పుకోవడానికి 9 ఏళ్ళు సమయం పట్టింది అని తెలిపారు అనసూయ.

 

ఈ 9 ఏళ్ళ సమయంలో ఇంట్లో వాళ్లతో పోరాడి ఓపిక నశించిన అనసూయ ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటే వద్దు ఇంట్లో వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అని భరద్వాజ్ చెప్తూండే వాడంట.చివరకి 2010 ఫిబ్రవరి 10 న వీరి వివాహం జరిగింది.ఇప్పుడు ఈ ప్రేమజంటకు ఇద్దరు పిల్లలు.కొద్దీ నెలలలో 10 ఏళ్ళ వివాహ జీవితాన్ని పూర్తి  చెయ్యనున్నారు అనసూయ భరద్వాజ్. ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా 9 ఏళ్ళు వేచి చూసింది అనసూయ..