Ads
యాంకర్ గా ఆడవాళ్లు మాత్రమే సూట్ అవుతారు మగవాళ్ళకి యాంకరింగ్ అంతగా సూట్ అవ్వదు అనుకునే రోజుల్లో మెయిల్ యాంకర్ గా బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఆ తరువాత యాంకరింగ్ లోనే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళాడు. ఎన్నో రకాల టీవీ షోస్ చేసి యాంకర్ సుమకి ఏకైక కాంపిటేటర్ గా అవతరించాడు. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం అతనికి లైఫ్ ఇస్తే ఢీ షో అతనికి స్టార్ స్టేటస్ ని ఇచ్చింది.
Video Advertisement
ఢీ షో కి గత సీజన్ వరకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే ఈ సీజన్లో యాంకర్ గా నందు ని చూసిన ప్రేక్షకులు ముందు షాక్ అయ్యారు. తర్వాత ప్రదీప్ ని బాగా మిస్ అయ్యారు. చాలా రోజులుగా ప్రదీప్ షోస్ లో గాని, సినిమాలలో గాని, బయట ఈవెంట్స్ లో గాని ఎక్స్పోజ్ అవడం లేదు. దీంతో ప్రదీప్ కి ఏమైంది అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తాయి. అయితే ఇటీవల ప్రదీప్ ఒక జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ లుక్ లో ప్రదీప్ బాగా కండలు పెంచేసి ఫేస్ లో కూడా కొంచెం చేంజ్ వచ్చి కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ప్రదీప్ ఏంటి ఈ రేంజ్ లో మారిపోయాడు, ఇదంతా కొత్త సినిమా కోసమేనా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే కొందరు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు కానీ కొందరు మాత్రం మనకెందుకు భయ్యా ఇవన్నీ బ్యాక్ వచ్చి మళ్ళీ టీవీ ఇండస్ట్రీలోనే యాంకరింగ్ మొదలు పెట్టు అంటూ మెసేజ్లు పెడుతున్నారు.
ప్రదీప్ ఇంతకుముందు కూడా సినిమాలలో చిన్నచిన్న రోల్స్ చేశాడు. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు. అయితే అవేవీ ప్రదీప్ కి అనుకున్నంత పేరుని తీసుకురాలేకపోయాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
watch video :
End of Article