ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులోకి వెళ్తున్న కంటెస్టెంట్ వీళ్ళే అంటూ చాలా మంది పేర్లు ఇప్పటివరకు వినిపించాయి.

12 anchor ravi

వీరందరిలో బాగా వినిపించే పేరు మాత్రం యాంకర్ రవిది. బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ లో మొదటి పేరు రవి అని చాలా గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయం పై రవి రాకింగ్ రాకేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. “నేను బిగ్ బాస్ లోకి వెళ్లి ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నాకు తెలియదు. ఒకవేళ వెళ్తే మాత్రం నేను మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను” అని చెప్పారు. అంతే కాకుండా ఇప్పుడు తాను హీరోగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాను అని, బిగ్ బాస్ కి వెళ్తే అవన్నీ హోల్డ్ లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పారు. కానీ బిగ్ బాస్ ద్వారా తన సినిమాలకి ప్రమోషన్ అవుతుంది అనే కోణంలో మాత్రం తాను అసలు ఆలోచించట్లేదు అని అన్నారు రవి.