“అదిరింది” షో నుండి ఆ యాంకర్ అవుట్..! కారణాలు ఇవే.! అసలు నిజం బయటపెట్టిన సమీరా.!

“అదిరింది” షో నుండి ఆ యాంకర్ అవుట్..! కారణాలు ఇవే.! అసలు నిజం బయటపెట్టిన సమీరా.!

by Sainath Gopi

Ads

జబర్ధస్త్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ షో కోసం ఎంతో మంది గురువారం, శుక్రవారం రాత్రి 9గంటల 30నిమిషాల కోసం పడిగాపులు కాస్తుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ షో నుంచి ఎంతో మంది కమిడియన్స్‌ సినిమాల్లో అవకాశాలు సాధించారు. అందులో ఒకరు చమ్మక్ చంద్ర. అ ఆ’, ‘అరవింద సమేత’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘రాజా ది గ్రేట్’, ‘టాక్సీవాలా’, ‘వెంకీ మామ’ సినిమాల్లో నటించారు చంద్ర.

Video Advertisement

తాజాగా జబర్దస్త్ లో జరిగిన వివాదాల గురించి అందరికి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఈ షో నుండి బయటకి వచ్చేసారు. మరో ఛానల్ లో ప్రసారమయ్యే అదిరింది షోలో జడ్జిగా చేస్తున్నారు నాగబాబు. నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి అదిరింది షోలో చేస్తున్నారు.

తాజా టీఆర్పీ రేటింగుల ప్రకారం ఈ అదిరింది షో నిర్వహకులకు అదిరిపోయే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. తెలుగులో ప్రసారం అవుతున్న లోకల్ గ్యాంగ్ కంటే వెనుక స్థానంలో అదిరింది ఆగిపోయింది. దీనిపై నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. అందుకే అదిరింది ఆగిపోనుంది అంటున్నారు. నాగబాబు పరిస్థితి గందరగోళంగా తయారైనట్లు తెలుస్తోంది. జబర్ధస్త్ వదలి వచ్చే ముందు ఆ షో నిర్వాహకులపై వీపరింతగా కామెంట్స్ చేశారు. అదిరింది ప్రారంభం అయిన తర్వాత ఆయన జబర్థస్త్ పై విమర్శలు కురిపించారు. ఇక ఇప్పుడు అదిరింది ఆగిపోతే నాగబాబు పరిస్థితి ఏంటి? మళ్ళీ జబర్దస్త్ కు వెళ్తారా? లేక అదిరింది షోనే హిట్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తారా?

ఇక అదిరింది షో ప్లాప్ అవ్వడానికి గల కారణాలు అంటే…అందరు పాత సీసాలో కొత్త సారాలా ఉంది అంటున్నారు. కామెడీ లో క్వాలిటీ మిస్ అవుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. యాంకర్ నవ్వు, జడ్జెస్ కామెంట్స్ అంతా ఆర్టిఫిషల్ గా ఉంది అని అభిప్రాయపడుతున్నారు. మరి ఇకముందైనా ఆ పద్దతి మారిస్తే హిట్ అవ్వచ్చు. ఇది ఇలా ఉండగా…ఇప్పుడు ఈ షోకి ఇంకో ట్విస్ట్ ఎదురైంది. ఈ షో యాంకర్ సమీరా ఈ షో నుండి తప్పుకుంది. దానికి గల కారణాలను సోషల్ మీడియాలో తెలిపింది. ఆ వీడియో మీరే చూడండి.

watch video: (please wait for few seconds if the video doesn’t load)


End of Article

You may also like