యాంకరింగ్ రంగంలో మకుటం లేని మహరాణి సుమ. కేవలం టీవి ప్రోగ్రామ్స్ యాంకరింగే కాదు సినిమా ఈవెంట్స్ కూడా సుమ సారధ్యంలో జరగాల్సిందే. మరోవైపు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే లక్షల్లో సబ్స్క్రైబర్స్.మన తరానికే కాదు మరో రెండు మూడు తరాల వరకు యాంకర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అంతగా పేరు సంపాదించింది.

మళయాళి కుటుంబంలో పుట్టినప్పటికి సుమలా స్పష్టంగా తెలుగు మాట్లాడే యాంకర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు యాంకరింగ్ రంగంలో సుమ రాజసం వెనుక ,ఒకప్పడు పడిన కష్టం ఉంది. మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి. నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ. ఏ టివి పెట్టినా..ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు. “రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు.

గతంలో రాజీవ్ – సుమల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కొంతమంది అయితే వారు విడాకులు కూడా తీసేసుకున్నారు అని రాసేశారు. ఇప్పుడు వాటి అన్నిటికి తన ట్వీట్ తో చెక్ పెట్టారు సుమ గారు. ’నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం’ అంటూ రాజీవ్ ని హత్తుకుని ఉన్న ఫోటో షేర్ చేసారు. తాజాగా కాష్ ప్రోగ్రాంలో కూడా రాజీవ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ వీడియో ఎంతో వైరల్ అయ్యింది. ఇకనైనా అలా తప్పుడు రాతలు రాసే వారు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిది.