అయ్యో సుమక్కకు ఎంత కష్టం వచ్చింది…! కిటికీలోంచి దూకి మరీ…వీడియో వైరల్…!

అయ్యో సుమక్కకు ఎంత కష్టం వచ్చింది…! కిటికీలోంచి దూకి మరీ…వీడియో వైరల్…!

by Sainath Gopi

Ads

యాంకరింగ్ రంగంలో మకుటం లేని మహరాణి సుమ. కేవలం టీవి ప్రోగ్రామ్స్ యాంకరింగే కాదు సినిమా ఈవెంట్స్ కూడా సుమ సారధ్యంలో జరగాల్సిందే. మరోవైపు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే లక్షల్లో సబ్స్క్రైబర్స్.మన తరానికే కాదు మరో రెండు మూడు తరాల వరకు యాంకర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అంతగా పేరు సంపాదించింది.

Video Advertisement

మళయాళి కుటుంబంలో పుట్టినప్పటికి సుమలా స్పష్టంగా తెలుగు మాట్లాడే యాంకర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు యాంకరింగ్ రంగంలో సుమ రాజసం వెనుక ,ఒకప్పడు పడిన కష్టం ఉంది. పెళ్లై,పిల్లలుపుట్టాక యాంకరింగ్ కి దూరం అయినా, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేప్పుడు ఒక చిన్న ఛానెల్ నుండే తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

ఇది ఇలా ఉంటె…తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన సుమకు ఓ వింత కష్టం వచ్చింది. సుమ ఆ ఈవెంట్ కి వెళ్లే సరికే ఆడియన్స్ అంతా వచ్చేసి గోల చేస్తూ ఉన్నారు. ఇక చేసేది ఏమి లేక… కిటికీలోంచి దూకి వెళ్లారు అంట సుమ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాపం సుమక్కకు ఎంతటి కష్టం వచ్చిందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి. నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ..ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ. ఏ టివి పెట్టినా..ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు. “రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు.

సుమ గారు హోస్ట్ చేసే ఈ టీవీ లో ప్రసారమయ్యే కాష్ ప్రోగ్రాం గురించి అందరికి తెలిసిందే. సాధారణంగా లేడీస్ ఈ షో ని అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. గేమ్స్ పెడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సుమ.


End of Article

You may also like