“సుమ” సక్సెస్ వెనకున్న ఈ కథ గురించి మీకు తెలుసా.? సుమ తల్లిగారు చెప్పిన విషయాలివే.!

“సుమ” సక్సెస్ వెనకున్న ఈ కథ గురించి మీకు తెలుసా.? సుమ తల్లిగారు చెప్పిన విషయాలివే.!

by Mohana Priya

టీవీలో బెస్ట్ యాంకర్ ఎవరు అని అడిగితే అందరూ ఏకగ్రీవంగా చెప్పే పేరు సుమ. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రోగ్రామ్స్ లో అదే ఎనర్జీ తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు సుమ. టీవీ షో ల్లోనే కాకుండా ఆడియో ఫంక్షన్ వేడుకలకి కూడా అక్కడున్న సందడిని హ్యాండిల్ చేస్తూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తారు. ఒక ఆడియో ఫంక్షన్ కి సుమ యాంకరింగ్ చేస్తున్నారు అంటేనే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా టీవీలో షోస్ చేస్తూ, ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ మధ్య యూట్యూబ్ లో కూడా మనందరినీ అలరిస్తున్న సుమ ఇంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట.

Video Advertisement

 

కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అట. అప్పుడే అవాక్కయ్యారా షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారట సుమ. అలాగే చిన్నప్పటి నుంచి కూడా తను చేసే ప్రతి పనిలో తన కుటుంబం తనని ఎంతగానో ప్రోత్సహించిందని సుమ చాలా సందర్భాల్లో చెప్పారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుమ తల్లి విమల ఈ విధంగా మాట్లాడారు “అందరి తల్లుల లాగా నేను కూడా నా కూతురు ఆరోగ్యంగా, క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలి అని, అలాగే తను అనుకున్నవన్నీ నిజమవ్వాలి అని కోరుకుంటాను. నాకు నా తల్లి నా కలలని నెరవేర్చుకోవడానికి ఎలాగైతే స్వేచ్ఛనిచ్చారో, నేను కూడా సుమ కి తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంచుకునే గిఫ్ట్ ఆఫ్ ఛాయిస్ (నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ) ని ఇచ్చాను. నేను తను టెలివిజన్ పర్సనాలిటీ అవుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు.

కానీ చిన్నప్పుడు తనని డాన్స్ క్లాస్ లో జాయిన్ చేయించడం, స్కూల్ లో తెలుగు తీసుకోమనడం, ప్రతి కాంపిటీషన్ లో పాల్గొనమని ప్రోత్సహించడం, చిన్నప్పటి నుంచి తన విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇవ్వాళ ఇలా ఇంప్లిమెంట్ అయ్యాయి ఏమో అని అనిపిస్తుంది. సుమ ఏదైనా చాలా తొందరగా నేర్చుకుంటుంది.

చిన్నప్పుడు నేను తనకి శ్లోకాలు, పద్యాలు నేర్పేదాన్ని. నేను చెప్పేది విని తను గుర్తు పెట్టుకునేది. పోయెట్రీ, మైమ్, డిబేట్, ఎలక్యూషన్ ఇలా అన్నిట్లో తనని పాల్గొనమని అడిగేదాన్ని, తను కూడా ఎంతో ఆసక్తిగా అన్ని కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఆ ఆసక్తి, ఉత్సాహం అన్ని తను ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి తోడ్పడ్డాయి” అని అన్నారు.


You may also like