యాంకర్ సుమ “పుష్ప”లో నటిస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

యాంకర్ సుమ “పుష్ప”లో నటిస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

by Megha Varna

Ads

“అల వైకుంఠపురం” చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు హీరో అల్లు అర్జున్,అయితే తాజాగా సుకుమార్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.ఇదివరకు అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య ,ఆర్య 2 సంచలన విజయాలను నమోదు చేసుకోవడం వలన ఈ చిత్రం మీద అంతటా ఆసక్తి నెలకొంది.

Video Advertisement

ఇది ఇలా ఉండగా… స్టార్ యాంకర్ సుమ “పుష్ప” చిత్రంలో నటించబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కి అక్కగా పుష్ప సినిమాలో యాంకర్ సుమ గారు నటించనున్నారు అనే వార్త షికార్లు కొట్టింది సోషల్ మీడియాలో. ఈ వార్త పుష్ప చిత్ర బృందానికి చేరడంతో ఈ వార్తలో నిజం లేదని సుమ గారు ఈ చిత్రంలో నటించట్లేదు అని క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర బృందం.అయితే ఫస్ట్ లుక్ లో బన్నీ ఆటిట్యూడ్ ,రఫ్ లుక్ కి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.పుష్ప చిత్రంలో బన్నీ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా ప్రేక్షకులకు కనపడి కనువిందు చెయ్యనున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ,సుకుమార్ కు ఎక్కువ సినిమాలకు సంగీతం అందించి మ్యూజికల్ బ్లాక్బూస్టర్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్  ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.అయితే “పుష్ప”  చిత్రం భారీ యాక్షన్ మరియు హృదయాన్నిహత్తుకునే కధాంశంతో తెరకెక్కబోతున్నదని ఇప్పటిదాకా అందుతున్న సమాచారం.పాన్  ఇండియన్ లెవెల్ లో బెస్ట్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.ఈ చిత్రంలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ని ఎంపిక చేసారని తెలుస్తుంది.సునీల్ శెట్టి పాత్ర పుష్ప చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది అని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ కి తెలుగు ప్రేక్షకులే కాకుండా ములాయం చిత్రసీమలో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.అందుకే ఈ చిత్రాన్ని5  బాషలలో తెరకెక్కిస్తున్నారు కాగా దాదాపు అన్ని భాషలలోను డబ్బింగ్ బన్నీ నే చెప్పబోతునున్నారని ఇప్పటిదాకా అందుతున్న సమాచారం. ఈ మధ్యకాలంలో ” గీత గోవిందం “,”సరిలేరు నీకెవరు” లాంటి హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన బన్నీ కి జంటగా నటించబోతున్నారు.


End of Article

You may also like