Home News “రాముడికి 1000 మంది మహిళలతో సంబంధం, అంతే కాదు.?”.. ఇంత అసభ్యంగా కామెంట్స్ చేసిన ఈమె ఎవరు.?

“రాముడికి 1000 మంది మహిళలతో సంబంధం, అంతే కాదు.?”.. ఇంత అసభ్యంగా కామెంట్స్ చేసిన ఈమె ఎవరు.?

by Mohana Priya

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు దేశమంతా పండుగలాగా జరుపుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం రావణుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చేశారు. సాధారణంగా అక్కడి వాళ్ళు రావణుడిని దేవుడిలాగా భావిస్తారు.

దాంతో ఆ రోజు మాత్రం సోషల్ మీడియాలో అదే విషయానికి సంబంధించిన ట్రెండ్ ఒకటి అయ్యింది. ఇది మాత్రమే కాదు. గతంలో ఉదయనిధి స్టాలిన్ వంటి రాజకీయ నాయకులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడారు.

వారు మాట్లాడినవి చాలా మందికి సరైన మాటలలాగా అనిపించకపోవడంతో అవి చర్చలకి దారి తీసాయి. ఇప్పుడు మరొక వ్యక్తి కూడా రాముడికి సంబంధించి మాట్లాడిన ఒక పాత వీడియో వార్తల్లోకి వచ్చింది. ఆమె పేరు ఉమా ఇలక్య. ఉమా అన్నా డిఎంకె వారి ఛానల్ అయిన కలైనర్ సేథిగల్ అనే ఒక ఛానల్ కి యాంకర్ గా పనిచేస్తున్నారు. ఉమాకి, ఎం కే స్టాలిన్ కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది అనే వార్త ఒకటి ప్రచారంలో ఉంది.

anchor comments on lord rama

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఉమా ద్రవిడర్ కళగం అనే ద్రవిడులకి సంబంధించిన ఒక రాజకీయ ఉద్యమానికి అందులో ఉన్న తమిళ్ కౌన్సిల్ కి డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఉమా రాముడికి సంబంధించి ఒక మీటింగ్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి.

anchor comments on lord rama

ఇందులో ఉమా, “రాముడికి మద్యం సేవించే అలవాటు ఉంది. మనుషులని హతమారుస్తారు. ఆడవారి పట్ల ఆసక్తి ఎక్కువ. ఎన్నో వేల మంది అమ్మాయిలతో సంబంధం కలిగి ఉన్నారు. ధైర్యం ఎక్కువగా లేకపోవడంతో సరయు నదిలో దూకారు. ఆయనని ఉదాహరణగా చూపించి పిల్లలని పెంచుతారా? రాముడు తన భార్యని అవమానించి అడవులకు పంపించారు. ఈ విషయంలో ఆయనని ఏ విధంగా ఉదాహరణగా చూపిస్తారు?” అంటూ ఉమా మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చాక చాలామంది ఉమా మీద కామెంట్స్ చేస్తున్నారు. ఉమా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, ఆమె మాట్లాడిన మాటలు సరైనవి కాదు అని అంటున్నారు.

ALSO READ : సమ్మక్క సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..? దీనికి కారణం ఏంటంటే..?

You may also like