కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివ లింగం… వంతెన పనుల తవ్వకాల్లో బయటపడ్డ అద్భుతం.!

కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివ లింగం… వంతెన పనుల తవ్వకాల్లో బయటపడ్డ అద్భుతం.!

by Harika

Ads

ఏదైనా తవ్వకాలు జరిగినప్పుడు పురావస్తు వస్తువులు బయటపడడం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి కొన్ని అద్భుతాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. తాజాగా రాయచూరు జిల్లా శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిలో జరుగుతున్న తవ్వకాల్లో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివ లింగం లభ్యమయ్యాయి. విగ్రహాలను అక్కడ పని చేసే సిబ్బంది నదిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు.

Video Advertisement

కృష్ణా నదిలో విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామి రెండు విగ్రహాలు, శివలింగం లభ్యమయ్యాయి.ఇక్కడ లభ్యమైన విష్ణు విగ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పరిశోధకులు,చరిత్రకారులు ఆ విగ్రహాలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కృష్ణా నదిలో నీరు అడుగంటిపోవడంతో మత్స్యకారులు అదే నీటిలో చేపలు పడుతుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. అలాగే కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టి అక్కడక్కడ మట్టిని తవ్వారు. ఈ క్రమంలోనే భూమిలో పాతిపెట్టిన విగ్రహాలు ఇప్పుడు బయటకు వచ్చి ఉండొచ్చని అంటున్నారు. దొరికిన మూడు విగ్రహాలు వేర్వేరుగా ఉన్నాయి.

ఇక్కడ లభించిన విష్ణు, ఈశ్వర లింగ విగ్రహాలు 12 నుంచి 15వ శతాబ్దానికి చెందినవిగా చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన విగ్రహాలు రాణి రుద్రమ్మ దేవి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివని చరిత్రకారుల అంచనా వేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు వీటిని ప్రతిష్టించి ఉంటారు అని అంటున్నారు. ఈ విగ్రహాలను చూడడానికి స్థానికులు, పురావస్తు అభిమానులు అక్కడికి విచ్చేశారు.


End of Article

You may also like