Ads
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. రాజధాని నిర్మాణంకు ప్రధాని నరేందర్ మోడి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది.
Video Advertisement
ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచింది. ఈ ఎనిమిది ఏళ్ళలో అమరావతి ఎలా ఉంది. బడ్జెట్ ఎంత కేటాయించారు. ఎంత ఖర్చుపెట్టారు అనే విషయన్ని ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతి మాత్రమే కాదని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి నాలుగేళ్ళు పూర్తయ్యింది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, వైజాగ్ పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయితే అమరావతి శాసన రాజధాని అని చెప్పిన తర్వాత హైకోర్టు అలా చెల్లుబాటు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుకు ముందే గవర్నమెంట్ తాము చేసిన చట్టాలను ఉపసంహరించుకుని రాజధాని విషయంలో వెనుకడుగు వేసింది. చట్టాలను పగడ్బందీ రూపొందిస్తామని చెప్పింది. అయితే అది జరగలేదు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.
ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల నివాసాల పనులు 90 శాతం పూర్తి అయ్యాయి. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ సగం పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కొంతవరకు పూర్తయ్యింది. ముఖ్యమయిన సెక్రటేరియేట్ టవర్స్ పనులు పునాది దశలోనే ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఏపీలో గవర్నమెంట్ మారడం, రాజధాని విషయంలో విధానపరంగా నిర్ణయాలు కూడా మారిపోవడంతో రాజధాని అమరావతి కండిషన్ అయోమయంలో పడింది. అక్కడ నిర్మాణాల ఏ పరిస్థితిలో ఉన్నవి అక్కడే అర్థాంతరంగా నిలిచిపోయాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
End of Article