Home Viral కోపమొచ్చి పెళ్లి పందిరిలో అందరిముందు ఆ నవ వధువు ఏం చేసిందో తెలుసా.? (వైరల్ వీడియో)

కోపమొచ్చి పెళ్లి పందిరిలో అందరిముందు ఆ నవ వధువు ఏం చేసిందో తెలుసా.? (వైరల్ వీడియో)

by Mohana Priya

కొన్ని సంఘటనలు సీరియస్ గా జరిగినా కూడా, చూస్తూ ఉంటే నవ్వు తెప్పిస్తాయి. అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సీరియస్ విషయం అయినా కూడా నెటిజన్లు అందరూ దీనికి కామెడీగా రియాక్ట్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, ఈ వీడియోలో ఒక పెళ్లి జరుగుతోంది. వారి బట్టలను బట్టి ఇది ఒక దక్షిణ భారత దేశానికి చెందిన వారి పెళ్లి అని అర్థం అయిపోతోంది.

Angry bride video going viral

అయితే ఈ వీడియోలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకి స్వీట్ తినిపిస్తోంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నోట్లో స్వీట్ పెట్టబోతుండగా ఆ స్వీట్ తినేందుకు పెళ్ళి కొడుకు కొంచెం ఆలస్యం చేశాడు. దాంతో కోపం తెచ్చుకున్న ఆ పెళ్ళి కూతురు ఆ స్వీట్ ముక్కని పెళ్ళి కొడుకు మీదకి విసిరికొట్టింది.

Angry bride video going viral

పక్కన ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో ట్యూబ్ ఇండియన్ ఒక పేజ్ షేర్ చేసింది. షేర్ చేసిన కొంత సమయంలోనే ఈ వీడియోని ఎంతో మంది చూశారు. ఎన్నో లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కామెంట్స్ లో చాలా వరకు ఫన్నీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

watch video :

https://www.instagram.com/p/CP8QBIPA9H4/?utm_source=ig_web_copy_link

 

You may also like