స్టార్ హీరో పార్టీలో ఆ డైరెక్టర్ మిస్సింగ్.. హీరో పై ఫాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి!

స్టార్ హీరో పార్టీలో ఆ డైరెక్టర్ మిస్సింగ్.. హీరో పై ఫాన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి!

by Megha Varna

సంక్రాతి విన్నర్ “అల వైకుంఠపురంలో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ కొట్టిన సినిమా.సీనియర్ నటి టబు, రాహుల్ రామకృష్ణ, సునీల్, సుశాంత్, జయ రామ్, మురళి శర్మ, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటించారు. ఇక బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి అయితే కుర్రాళ్లందరూ ఫిదా అయిపోయారు.

Video Advertisement

సంక్రాంతి పండగకి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డు సృష్టించింది. వందల కోట్లు వసూలు చేసి దూసుకెళ్లింది. అయితే తాజాగా ఈ చిత్రం మంచి హిట్ అవడంతో అల్లు అర్జున్ టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే…ఈ పార్టీకి ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వచ్చారు. కానీ సంక్రాంతి మరో విన్నర్ “సరిలేరు నీకెవ్వరూ” దర్శకుడు “అనిల్ రావిపూడి” మాత్రం మిస్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బన్నీ దర్శకులందరూ పిలిచారు కాబట్టి అనిల్ రావిపూడి కూడా పిలవల్సిందని అంటున్నారు. సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటీ పడిన విషయం అందరికి తెలిసిందే.

అల్లు అర్జున్ దర్శకుడు అనిల్ రావిపూడి పిలిచినప్పటికీ ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పార్టీకి హాజరు అవ్వకపోయుండచ్చు కదా అని బన్నీని సమర్థిస్తున్నారు అతని ఫాన్స్. ఏది ఏమైనా ఈ విషయంపై బన్నీ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాలి.


You may also like

Leave a Comment