“అనిల్ రావిపూడి” అన్నయ్య కూడా డైరెక్టర్ అని తెలుసా? ఆయన బాలయ్యతో తీసిన సినిమా ఏంటంటే?

“అనిల్ రావిపూడి” అన్నయ్య కూడా డైరెక్టర్ అని తెలుసా? ఆయన బాలయ్యతో తీసిన సినిమా ఏంటంటే?

by Mounika Singaluri

Ads

తక్కువ టైం లో టాప్ డైరెక్టర్ల ప్లేస్ లోకి వెళ్లిపోయిన వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన అనిల్ రావిపూడి వరుసగా సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో హిట్లు కొట్టి తక్కువ టైం లోనే స్టార్ డైరెక్టర్ అయ్యారు. రాబోయే ఎఫ్ 3 సినిమా కూడా హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీనితో.. ఈ సారి కూడా అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడబోతోంది.

Video Advertisement

ఇది ఇలా ఉంటె.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అనిల్ రావిపూడి సినిమాల్లోకి వచ్చిందే ఆయన కజిన్ ప్రోద్బలంతో. అనిల్ రావిపూడి అన్నయ్య (పెదనాన్న కొడుకు) కూడా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

anil ravipudi

ఆయన ఎవరో కాదు.. పిఎ. అరుణ్ ప్రసాద్. సినిమా కెరీర్ లో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తమ్ముడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఆ తరువాత బాలయ్య బాబుతో కూడా “భలే వాడివి బాసు” అనే సినిమాను తీశారు. అప్పటికే బాలయ్య బాబు “నరసింహ నాయుడు” లాంటి బ్లాక్ బస్టర్ ను కొట్టారు.

ఆ తరువాత విడుదల అయిన “భలే వాడివి బాసు” సినిమాపై షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. అయితే.. సినిమా విడుదల అయిన తరువాత మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయినప్పటికీ.. ఈ సినిమా బాలయ్య అభిమానులను మాత్రం మురిపించింది. యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందిన “భలే వాడివి బాసు” లో బాలయ్యను సరికొత్తగా చూపించారు. ఈ సినిమాలో అంజలి ఝవేరి, శిల్పా శెట్టి హీరోయిన్లుగా నటించారు.


End of Article

You may also like