అలాంటివారు జోకర్స్ అంటూ సంబోధించిన యానిమల్ డైరెక్టర్ సందీప్…!

అలాంటివారు జోకర్స్ అంటూ సంబోధించిన యానిమల్ డైరెక్టర్ సందీప్…!

by Mounika Singaluri

Ads

తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ మూవీ తో రణబీర్ కపూర్ స్టేటస్ కూడా చేంజ్ అయింది.ఏకంగా 800 కోట్ల పైబడి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. యానిమల్ సినిమా చాలామందికి విపరీతంగా నచ్చేసింది. వైలెన్స్ ఎంత ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Video Advertisement

అయితే చాలామంది క్రిటిక్స్ గాని విశ్లేషకులు గాని యానిమల్ సినిమా పైన నెగటివ్ రివ్యూస్ రాశారు. కొంతమంది అయితే యానిమల్ సినిమాని బ్యాన్ చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించారు. సందీప్ మాట్లాడుతూ అలాంటి వారిని జోకర్స్ అంటూ సంబోధించారు. సినిమాని సినిమాగా చూడాలనీ, క్రాఫ్ట్ అంటే ఏంటో తెలియని వారు కూడా ఈరోజు క్రాఫ్ట్ కోసం మాట్లాడేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన సినిమా నచ్చని జనాలు మీడియా వారు క్రిటిక్స్ అందర్నీ ఇల్లిటరేట్స్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే సందీప్ వ్యాఖ్యల పైన చాలామంది మీడియా జనం మండిపడుతున్నారు.


End of Article

You may also like