యానిమల్ సినిమాకి షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్….

యానిమల్ సినిమాకి షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్….

by Mounika Singaluri

Ads

రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు సినిమా నిడివి గురించి చాలా చర్చ జరిగింది.

Video Advertisement

ఈ సినిమా డైరెక్టర్ కట్ 3 గంటల 41 నిమిషాలు అని తెలిసిందే… అయితే థియేటర్లో అంత నిడివి పెట్టడం కష్టం కాబట్టి సినిమాని 3 గంటల 21 నిమిషాలకి ట్రిమ్ చేసి రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిడివి అనేది పెద్ద సమస్య లేకుండా పోయింది. సినిమాలో కంటెంట్ ఉండడం ఇంట్రెస్టింగ్ గా సాగడంతో నాలుగు గంటలు అయిన ప్రేక్షకులు చూసేస్తారు అని చెప్పుకున్నారు. అయితే అనిమల్ సినిమా ఓటిటి వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ కట్ ను డైరెక్ట్ ఓటిటి లోరిలీజ్ చేస్తామని సినిమా టీం ప్రకటించింది. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా టీం కి నెట్ ఫ్లిక్స్ పెద్ద షాక్ ఇచ్చింది.

Animal movie review

తమ ఫ్లాట్ ఫామ్ లో కేవలం సెన్సార్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడు ఓటిటి లో కంటెంట్ పైన సమస్య తలెత్తడంతో ఇబ్బందులేకుండా సెన్సార్ అయిన వెర్షన్ ప్రసారం చేస్తామని, ఇది రాబోయే అన్ని సినిమాలకి వర్తిస్తుందని ప్రకటించింది. ఇది అనిమల్ సినిమా ఫుల్ వెర్షన్ చూద్దామనుకున్న ప్రేక్షకులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో డైరెక్టర్ కట్ లో ఇంకేం సీన్స్ ఉన్నాయో అంటూ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది ప్రేక్షకులకు నిరాశ కలిగించే వార్త


End of Article

You may also like