Ads
కొద్ది సంవత్సరాల క్రితం హారర్ కామెడీ జోనర్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా గీతాంజలి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రూపొందింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : గీతాంజలి మళ్లీ వచ్చింది
- నటీనటులు : అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి.
- నిర్మాత : MVV సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్
- దర్శకత్వం : శివ తుర్లపాటి
- సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
- విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024
స్టోరీ :
శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్) సినిమా అవకాశాల కోసం కష్టపడుతూ ఉంటారు. అయాన్ (సత్య) హీరో అవుతాను అని కలలు కంటూ ఉంటాడు. తన కల కోసం శ్రీను, ఆరుద్ర, ఆత్రేయకి చాలా డబ్బులు ఖర్చు చేస్తాడు. కానీ తన కల మాత్రం నెరవేరదు. మరొక పక్క, శ్రీనుకి విష్ణు ( రాహుల్ మాధవ్) అనే ఒక ఊటీ లోని వ్యాపారవేత్త మేనేజర్ అయిన గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి ఫోన్ కాల్ రావడంతో అక్కడ ఉన్న సంగీత్ మహల్ లో షూటింగ్ చేయాలి అని విష్ణు కథ ఇస్తాడు. అక్కడే అంజలి (అంజలి) ఒక కాఫీ షాప్ నడుపుతూ ఉంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ గా చేస్తేనే సినిమా తీస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్ మహల్ కథ ఏంటి? అసలు విష్ణు ఎవరు? గీతాంజలి మళ్లీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
హారర్ కామెడీ జోనర్ సినిమాలు ఒక సమయంలో చాలా ట్రెండ్ అయ్యాయి. కానీ తర్వాత వరుస పెట్టి అవే సినిమాలు వచ్చేటప్పటికి ప్రేక్షకులకు ఆసక్తి పోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కథనం కొత్తగా ఉన్నట్టు అనిపించినా కూడా మరొక పక్క హారర్ కామెడీ కావడంతో అదే టెంప్లేట్ లోనే నడుస్తుంది అని అర్థం అవుతుంది. ఈ సినిమా కూడా అలాగే నడుస్తుంది. పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. తెలిసిన ఫార్ములా లోనే నడుస్తుంది. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం రొటీన్ గా అనిపిస్తాయి. ఎమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. లాజిక్స్ అయితే అసలు ఫాలో అవ్వలేదు.
ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న వాళ్ళు అంతా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. సత్యకి మరొక మంచి పాత్ర దొరికింది. సునీల్ పాత్ర కూడా నవ్విస్తుంది. అంజలి పాత్ర నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కాదు. అలా వెళ్ళిపోతుంది అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అయితే మరి సాధారణంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కథపరంగా బలంగా అనిపిస్తుంది. ఇదే జాగ్రత్త ఫస్ట్ హాఫ్ లో కూడా తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- సత్య
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- బలహీనంగా ఉన్న స్క్రీన్ ప్లే
- గ్రాఫిక్స్
రేటింగ్ :
2.25/5
ట్యాగ్ లైన్ :
మొదటి భాగం లాగానే ఈ సినిమా కూడా ఉంటుంది అని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, లాజిక్స్ ఆలోచించకుండా, టైం పాస్ కోసం సినిమా చూద్దాం అని అనుకునే వారికి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “ఫిదా” సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?
End of Article