బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని  అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు…కాయ్‌పోచే, పీకే, రబ్తా, కేదార్‌నాథ్ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

Also read: సుశాంత్ ఆత్మహత్యకు కొన్నిగంటల ముందు ఏం జరిగింది?

ధోనీ బయోపిక్ “యం.ఎస్. ధోనీ.. అన్ టోల్డ్ స్టోరీ” చిత్రం ద్వారా యావత్ భారత ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్..బలవన్మరణాకి పాల్పడ్డాదు. ముంబైలోని తన ప్లాట్లో ఉరి వేసుకుని మరణించాడు.. సుషాంత్ మరణంతో బాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది..సుశాం త్ఇప్పటివరకు చేసినవి మంచి సినిమాలే..ఇకపై చేయడానికి చేతిలో సినిమాలున్నాయి..మరి సుశాంత్ ఎందుకు ఆత్మహత్యకి పాల్పడ్డాడు..ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి.మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also read: కంటతడి పెట్టిస్తున్న “సుశాంత్” ఇంస్టాగ్రామ్ చివరి పోస్ట్.

పవిత్ర రిస్తా సీరియల్లో సుశాంత్ సరసన నటించిన అంకితా లోకండేతో ఆరేళ్లగా ప్రేమలో ఉన్నాడు సుశాంత్.ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతారనగా బ్రేకప్ అయింది.. 2016లో వీరిద్దరూ విడిపోగా ప్రస్తుతం అంకితా విక్కి జైన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు.2016లో వీడిపోయేముందు ‘ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను’ అని అంకిత ట్వీట్ కూడా‌ చేసింది.

అయితే సుశాంత్‌ మరణవార్త విని అంకితా లోఖండే షాక్‌కు గురయ్యారు. స్థానిక మీడియా ఛానెల్ ఒకటి అంకితకు ఫోన్ చేసి సుశాంత్ మరణించిన విషయం చెప్పారంట. అప్పటివరకు అంకిత సుశాంత్ మరణవార్త తెలియదు అంట. ఒక్కసారిగా షాక్ అయ్యారంట. ఆ తర్వాత వెంటనే అంకిత ఫోన్‌ పెట్టేశారంట.

Also read: వైరల్ అవుతున్న సుశాంత్ 50 కలల లిస్ట్

ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాలుగు రోజుల క్రితం అతని మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1986 జనవరి 21న పట్నాలో సుశాంత్ సింగ్ జన్మించాడు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసారు. సుశాంత్ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో సేవా సంస్థ కూడా నిర్వహిస్తున్నాడు.

Also read: చదువులో టాపర్…నటన కోసం చదువు మానేసి…చివరికి ఇలా ? సుశాంత్ లైఫ్ స్పెషల్ స్టోరీ