Ads
నటుడు సుశాంత్ సింగ్ మరణం. యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది .బాంద్రాలోని తన ప్లాట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు సుశాంత్.. సుశాంత్ మరణానికి అనేక కారణాలు మరణించగా.. ఆత్మహత్యకారణంగానే సుశాంత్ మరణించినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడయింది..ఇదిలా ఉండగా సుశాంత్ మరణం తర్వాత అంకితా లోకండే పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అయింది..
Video Advertisement
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేమికురాలు అంకితా.. సుశాంత్-అంకితా పవిత్ర రిస్తా అనే సీరియళ్లో జంటగా నటించారు.తర్వాత ప్రేమికులుగా మారారు..వీరిద్దరి ప్రేమాయణం సుమారు ఆరేళ్లపాటు నడిచింది..పవిత్రరిస్తా సీరియల్లో వీరి జంటకి మంచి మార్కులు పడ్డాయి..నిజజీవితంలో కూడా ఒక్కటవుతుందనుకున్న జంట 2016లో విడిపోయారు..తర్వాత అంకితా విక్కి జైన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు.
సుశాంత్ మరణించిన కాసేపటికే చాలామంది అంకిత రెస్పాన్స్ కోసం వెయిట్ చేశారు.. ఒక టివి ఛానెల్ వాళ్లు కాల్ చేసి అంకితకు విషయం చెప్పగా..వ్వాట్ అని షాక్ కి గురై అంకిత కాల్ కట్ చేసింది..సుమారు సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత అంకిత తన ఇన్ట్సా అకౌంట్లో ఒక పోస్టు పెట్టింది.. “God Removes people from your life because he heard conversations that you didn’t hear” ఇది ఆ పోస్ట్ .. “మీరు వినని సంభాషణలను దేవుడు విన్నందున దేవుడు మీ జీవితం నుండి కొందరిని తొలగిస్తాడు” అని అర్దం.. తర్వాత కాసేపటికే డిలీట్ చేసింది.
అప్పటికే అంకిత రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్న అనేకమంది సుశాంత్ ఫ్యాన్స్ అంకిత పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి..ఇఫ్పుడు దానిపైన చర్చపెట్టారు.. “అంకిత ఏ ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ పెట్టింది..ఎందుకు డిలీట్ చేసింది అనే అనుమానాలు కొందరు నెటిజన్లు వెలిబుచ్చారు..ఒక నెటిజన్ ఏకంగా ముంబై పోలీస్ ని ట్యాగ్ చేస్తూ ఇది సుశాంత్ మాజి గర్ల్ ఫ్రెండ్ పెట్టిన పోస్ట్..ఇది అనుమానస్పదంగా లేదా అంటూ ప్రశ్నించాడు..
ఇదిలా ఉండగా ఈ విషయంపై అంకిత ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు.. సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆత్మహత్య చేసుకుని మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు..సుశాంత్ అంత్యక్రియల నిమిత్తం సుశాంత్ ఫ్యామిలి ముంబైకి చేరుకుంది.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా కూపర్ హాస్పిటల్ కి చేరుకుని సుశాంత్ పార్దీవదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది.
End of Article