కడచూపు కూడా దక్కలేదు…సెల్ ఫోన్ లో మృతదేహాన్ని చూపించి దహనం చేసారు.!

కడచూపు కూడా దక్కలేదు…సెల్ ఫోన్ లో మృతదేహాన్ని చూపించి దహనం చేసారు.!

by Megha Varna

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ..ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాధి బారిన పడ్డాయి ..అగ్రరాజ్యాలు సైతం చేసేది ఏమి లేక విలపిస్తున్నాయి. అమెరికా ,ఇటలీ లాంటి దేశాలు ఈ వ్యాధి కారణంగా బాగా ఎఫెక్ట్ అయ్యాయి ..సామజిక దూరం ఒక్కటే దీనిని ఎదుర్కోవడానికి మార్గం అని దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..

Video Advertisement

దీంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది …ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.చాలా మందికి ఆహారం కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు ..ఈ నేపథ్యంలో బస్సులు,రైలు ,విమాన మార్గాలని నిషేధించారు .దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది ..

కాగా ఎవరైనా చనిపోతే వారిని వారి ఇంటికి చేరే అవకాశం కూడా లేక వాట్సాప్ లో అంతిమ సంస్కారాలని వీక్షించే స్థితి ఏర్పడింది ..తాజాగా సింగపూర్ లో చనిపోయిన వ్యక్తిని మృతదేహాన్ని స్వదేశం తీసుకురావడానికి అవకాశం లేక వాట్సాప్ లోనే కుటుంబ సభ్యులు తిలకించి కన్నీరు మున్నీరు ఐన  సంఘటన మరువక  ముందే ఇలాంటి సంఘటనలు రోజురోజుకి వెలుగులోకి వచ్చి ప్రతిఒక్కరు కంట తడి పెట్టుకునేలా చేస్తున్నాయి ..కాగా తాజాగా ఇలాంటి సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే …

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని కొత్తశింగరబొట్లపాలేనికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అప్పనబోయిన సుధారాణి (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఉంటున్నారు . ఆమె భర్త గోవిందరావు అక్కడే ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన సుధారాణికి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు . అయితే ఆమె మృత దేహాన్ని కొత్తశింగరబొట్లపాలెం తీసుకొచ్చేందుకు అనుమతి లేక తిరుపతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్‌లో మృతదేహాన్ని, అంత్యక్రియల దృశ్యాన్ని చూపించి దహనం చేశారు. కాగా చివరిసారి చూసుకునే అవకాశం రాలేదని ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు .


You may also like

Leave a Comment